అతను పాడితే.. గాడిద గొంతు కలిపింది.. ఫన్నీ వైరల్ వీడియో..!
సౌత్ కరోలినా : ఎవరైనా కీచు గొంతుతో పాడుతుంటే.. ఆపరా నీ నస.. నీ పాటకు గాడిదలు కూడా పారిపోతాయిరా అంటూ ఫ్రెండ్స్‌ను ఎగతాళి చేసే సన్నివేశాలు చూసి ఉంటాము. అయితే సౌత్ కరోలినాలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఓ పెట్ గాడిద తన యజమాని పాడుతుంటే గొంతు కలిపింది. మామూలుగా ఓండ్రు పెట్టినట్లు కాకుండా అదో మ్యూజిక్ సెన్స్‌లా తనకు అనిపించిందంటూ సదరు యజమాని ఫేస్‌బుక్‌లో పెట్టిన సదరు వీడియో తెగ వైరల్‌గా మారింది.
సౌత్ కరోలినాకు చెందిన ట్రావిస్ కిన్లే ఓ పాట పాడారు. అయితే ఆయన పాడుతుంటే అందుకు అనుగుణంగా తన పెంపుడు గాడిద గొంతు కలిపింది. నువ్వొక్కడివే పాడతావా.. నేను సైతం అంటూ లైన్లోకి వచ్చింది. అలా కిన్లే పాడుతుంటే ఇలా గాడిద కూడా గొంతెత్తింది. ఆ ఫన్నీ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం చర్చానీయాంశమైంది.

లయన్ కింగ్ సినిమా ఓపెనింగ్ సాంగ్ ''అకూన మటాట'' పాటను కిన్లే పాడుతుంటే.. యజమానికి తోడు అన్నట్లు ఆ పెంపుడు గాడిద గొంతు కలిపింది. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. వాస్తవానికి కిన్లేకు సదరు గాడిదతో పాటు గుర్రం కూడా పెట్‌గా ఉంది. అయితే ఈ వీడియోలో గాడిద స్పందించి యజమాని పాట పాడుతుంటే తన గొంతు సవరించింది. కానీ గుర్రం మాత్రం స్పందించలేదట.
యజమాని పాడుతుంటే గాడిద పాట పాడిందో.. అది దాని భాషలో ఏమి అరిచిందో తెలియదు గానీ.. కిన్లే మాత్రం తాను పాడుతుంటే పెట్ డాంకీ గొంతు కలిపిందని తెగ సంబరపడిపోతూ ఆ వీడియో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారి దాదాపు 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు 60 వేల షేర్లు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications