అంతా అబద్దం, ప్రైవసీకి భంగం కలిగిస్తోంది: గూగుల్‌పై దావా
Recommended Video

శాన్‌ఫ్రాన్సిస్కో: గూగుల్ తమ ప్రైవసీకి భంగం కలిగిస్తోందంటూ ఓ వ్యక్తి దావా వేశాడు. అనుమతి లేకుండానే తమ కదలికలను నిక్షిప్తం చేస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని సదరు వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు మెట్లు ఎక్కాడు.
లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసినప్పటికీ గూగుల్ సర్వీసెస్ మన కదలికలను ట్రాక్ చేస్తోందని అతను దావా వేశాడు. ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ కలిగిన అమెరికన్లు తమ కదలికలను రికార్డ్ చేయవద్దని గూగుల్ సెట్టింగ్స్‌లో లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసినప్పటికి సమాచారాన్ని రికార్డ్ చేస్తున్నాయని ఆరోపించారు.

తాము ఎక్కడెక్కడకు, ఎలా వెళ్తున్నామనే విషయాన్ని రికార్డ్ చేస్తోందని, కానీ సెట్టింగ్స్‌లో లొకేషన్ హిస్టరీని ఆప్ చేసుకోవచ్చునని గూగుల్ తన సపోర్ట్ పేజీలో చెప్పిందని, ఆఫ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా ఉందని, వివరాలన్నింటిని ట్రాకింగ్ చేస్తోందన్నారు. గూగుల్ చెప్పింది అంతా అబద్దమని ఆరోపించాడు.
ప్రైవసీ చట్టాన్ని గూగుల్ ఉల్లంఘించిందని గత వారం యూనివర్సిటీ పరిశోధకులు కూడా నిరూపించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దావాపై స్పందించేందుకు గూగుల్ నిరాకరించింది. ఏడేళ్ల కిందటి ఉత్తర్వులు గూగుల్ ఉల్లంఘించిందా పరిశీలించాలని ది ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ సంస్థ కూడా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు లేఖ రాసింది.












Click it and Unblock the Notifications