పొగ తాగుడు: విమానంలో ప్రయాణికుడిని కట్టేశారు

విమానం సిబ్బందితో హింసాత్మకంగా, తీవ్రంగా వ్యవహరించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారని కొరియర్ మెయిల్ రాసింది. విమానం సింగపూర్ నుంచి తెల్లవారు జామను ఒంటి గంట పది నిమిషాలకు బ్రిస్బేన్‌కు చేరుకున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాళ్లనూ చేతులను కట్టేసి సీట్లో కూర్చుండబెట్టిన ప్రయాణికుడిని తోటి ప్రయాణికుడు ఫ1టో తీశాడు. మాథియాస్ జోర్గ్ (54) ఆ ప్రయాణికుడిని బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విమానంలో పొగ తాగినందుకు, విమానం సిబ్బందిపై దాడి చేసినందుకు, దాడి చేసి సిబ్బంది విధులను అడ్డుకున్నందుకు ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు.
ఆస్ట్రేలియా పోలీసులకు పాస్‌పోర్టు స్వాధీనం చేస్తే ఆ ప్రయాణికుడికి బెయిల్ ఇస్తామని మెజిస్ట్రేట్ స్టీఫెన్ గుట్రిడ్జ్ చెప్పారు. అయితే, అతను అందుకు నిరాకరించినట్లు చెబుతున్నారు. జోర్గ్ జనవరి 10వ తేదీన మరోసారి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications