షాక్: 3 గంటలపాటు ఏటీఎంరూమ్‌లోనే , కాపాడిన పోలీసులు

ఏటిఎంలో చిక్కుకొన్న ఓ వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. ఏటిఎంలో నుండి డబ్బులతోపాటు బయటకు వచ్చే రశీదులపై తనను రక్షించండంటూ బాధితుడు రాసిన స్లిప్పులు ఆయనను కాపాడేందుకు దోహదపడ్డాయి.

టెక్సాస్: ఏటిఎంలో చిక్కుకొన్న ఓ వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. ఏటిఎంలో నుండి డబ్బులతోపాటు బయటకు వచ్చే రశీదులపై తనను రక్షించండంటూ బాధితుడు రాసిన స్లిప్పులు ఆయనను కాపాడేందుకు దోహదపడ్డాయి. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకొంది.

అమెరికా టెక్సాస్‌లోని కార్పన్‌క్రిస్టీ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కేంద్రంలోని ఏటిఎం కేంద్రంలో ఎలక్ట్రానిక్‌లాక్‌ను మార్చేందుకు ఓ కార్మికుడు ఏటీఏం అమర్చిన గదిలోకి వెళ్ళాడు. అయితే ఇంతలో అనుకోకుండా ఏటిఎం అమర్చిన గదిలో చిక్కుకుపోయాడు.

Man Trapped Inside Texas A.T.M. for 3 Hours Is Rescued by Police

అతను తన మొబైల్‌ఫోన్‌ను తన ట్రక్కులోనే మర్చిపోయాడు. తాను ఎలా బయటపడాలనే విషయమై అర్ధంకాలేదు. రెండు గంటలు గడిచిపోయాయి. చివరికి ఓ ఉపాయం తట్టింది.

ఏటిఎం నుండి బయటకు వచ్చే రశీదులపై తనను రక్షించండంటూ రాసి బయటకు పంపాడు. ఏటిఎం యంత్రంలో చిక్కుకొన్నాను. నా బాస్ ఫోన్ నెంబర్ అంటూ రాశాడు.

తొలుత ఈ ఏటిఎం వద్ద డబ్బులు తీసుకొనేందుకు వచ్చినవారు దీన్ని తేలికగా తీసుకొన్నారు. కానీ,ఏటిఎం నుండి అరుపులు రావడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు డోర్‌ను తెరిపించి అతడిని బయటకు తీసుకువచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+