వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం:కారుతో గేట్ ఢీకొట్టి, విమానం దొంగిలించబోయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో ఆశ్చర్యకరమైన దొంగతానానికి ఓ వ్యక్తి ప్రయత్నాలు చేశాడు. ఓ వ్యక్తి కారులో దూసుకొచ్చి... విమానాశ్రయం గేటును బద్దలు కొట్టాడు. అంతేకాదు, విమానాశ్రయంలోకి వెళ్లి జెట్ విమానాన్ని ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నించాడు.

ఈ సంఘటన అమెరికాలోని వాకో రీజనల్ విమానాశ్రయంలో జరిగింది. నిందితుడు తన కారుతో వేగంగా వచ్చి రన్ వే సెక్యూరిటీ గేటును ఢీకొట్టాడు. లోపలకెళ్లి ఓ వ్యాపారవేత్తకు చెందిన చిన్న జెట్ విమానం ల్యాండింగ్ గేరుకు అడ్డుగా ఉన్న టైర్ చౌక్‌లను తొలగించాడు.

Man Tries to Steal Learjet from Waco Airport

అందులోకి ఎక్కి విమానాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన గురువారం నాడు జరిగింది. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్న ఆ వ్యక్తి మానసిక సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ ఉద్యోగి ఇతనిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. మిగతా ఉద్యోగులు వచ్చేంతవరకూ ఆ వ్యక్తి లొంగలేదని పోలీసులు తెలిపారు. ఆపై అతనిపై నేరపూరిత కుట్ర, దొంగతనం, అరెస్టును నిరోధించడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టి మానసిక ఆరోగ్య అంచనా కోసం ఆసుపత్రికి తరలించారు.

English summary
A man in Waco, Texas, crashed through a security gate and tried to steal a Learjet from the city's regional airport Thursday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X