సెల్ఫీ కోసం యువకుడి సాహసం: జైలుపాలయ్యాడు
న్యూయార్క్: సెల్ఫీల మోజులో పడి చాలా మంది యువకులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మరికొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా వారిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. తాజా ఓ యువకుడి సెల్ఫీ కోసం చేసిన సాహసం అతడ్ని కటకటాల వెనక్కి నెట్టింది.
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన డేవిడ్ కార్నౌచ్ టెన్నెస్సీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతడు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జులై 4వ తేదీకి ముందు రోజు ప్రఖ్యాత బ్రూక్లిన్ బ్రిడ్జిపై బీమ్ ఎక్కి సాహాసోపేతమైన సెల్ఫీ దిగాడు.

అనంతరం ఆ సెల్ఫీని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ సెల్ఫీకి బోలెడన్ని లైక్‌లు, షేర్లు వచ్చాయి. దీంతో ఫొటో బాగా పాపులర్ అయిపోయింది.
అయితే ఆ ఫొటో పోలీసుల వరకు వెళ్లింది. ఇలాంటి ఫొటోల వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications