Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కారు ఎక్కడ పార్క్ చేశాడో మరిచిపోయాడు, 6 నెలలకు దొరికింది

ఓ వ్యక్తి తాను కారును ఎక్కడ పార్క్ చేశానో మరిచిపోయాడు. ఆ కారు ఆరు నెలల తర్వాత అతని చెంతకు చేరింది. ఈ ఆసక్తికర సంఘటన యూకేలోని మాంచెస్టర్‌లో చోటు చేసుకుంది.

యూకే: ఓ వ్యక్తి తాను కారును ఎక్కడ పార్క్ చేశానో మరిచిపోయాడు. ఆ కారు ఆరు నెలల తర్వాత అతని చెంతకు చేరింది. ఈ ఆసక్తికర సంఘటన యూకేలోని మాంచెస్టర్‌లో చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి గత ఏడాది జూన్‌ నెలలో మాంచెస్టర్‌లో జరిగిన ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లాడు. ఇందుకోసం తన స్నేహితుడి బీఎండబ్యూ కారులో స్కాంట్లాండ్‌ నుంచి మాంచెస్టర్‌ చేరుకున్నాడు.

కార్యక్రమం జరిగే ప్రాంతం దగ్గరలో ఆ కారును పార్క్‌ చేసి ఉత్సాహంగా సంగీత కార్యక్రమంలో చిందులేశాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అతనికి కారు ఎక్కడ పార్క్ చేశాడో గుర్తుకు లేదు. అక్కడంతా వెతికాడు.

Man who forgot where he parked his car six months ago is reunited with it

అయిదు రోజులపాటు ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరిగాడు. తన స్నేహితుడికి విషయం చెప్పాడు. ఇరువురు కలిసి గాలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగస్టులో పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అది ఇప్పుడు దొరికింది. ఆరు నెలల తర్వాత అంటే.. వారం రోజుల క్రితం పోలీసులకు మాంచెస్టర్‌ సిటీ సెంట్రల్‌ కాంపెక్స్‌లోని పార్కింగ్‌ స్థలంలో దుమ్ముపట్టిపోయి చాలాకాలంగా ఓ కారు ఉందని సమాచారం అందింది. దీంతో పోలీసులు కారు గురించి ఆరా తీయగా అది మరిచిపోయిన వ్యక్తికి తాలూకుది అని గుర్తించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+