షాకింగ్: పెంపుడు కుక్కతో సెక్స్, 47 ఏళ్ల వ్యక్తి అరెస్టు

వాషింగ్టన్: కుక్కతో శృంగారంలో పాల్గొన్న ఓ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆమెరికాలో చోటు చేసుకుంది. జంతువులతో క్రూరంగా ప్రవర్తించాడనే అభియోగాలతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జానీ ఈ చర్యకు పాల్పడ్డాడు.

జానీ పైన జంతు హక్కుల సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 47 ఏళ్ల జానీ తన కుక్కతో శృంగారం జరుపుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

Man who has sex with dog held

సిరియా దాడుల్లో 25మంది మృతి

హోమ్స్ ప్రావిన్స్‌లో సిరియా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది మృతి చెందారని సిరియన్ అబ్జర్వేటరి ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. శనివారం రాత్రి తాల్‌బిసేహ్ నగరంపై జరిపిన దాడుల్లో పది మంది పిల్లలు, ముగ్గురు మహిళలు సహా 18 మంది మృతి చెందారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ మానవహక్కుల సంస్థ వివరించింది.

గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిన్హువా వార్తాసంస్థ తెలిపింది. అల్‌వయేర్ శివార్లలో జరిపిన కాల్పుల్లో ఆరుగురు పురుషులు, ఒక బాలుడు మృతి చెందారు. ఇటీవలి కాలంలో అనేక నగరాలపై సిరియా వైమానిక దళం 533 దాడులు జరిపిందని పేర్కొంది.

దావూద్‌ను పాకిస్తాన్ రహస్య ప్రాంతానికి తరలించిందా?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అత్యంత రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పాక్ అండతో దావూద్ ఇబ్రహీం కరాచీలో సంపన్నులుండే క్లిఫ్టాన్ ప్రాంతంలో దర్జాగా జీవిస్తున్నాడు.

తాజాగా భారత్‌తో పాటు అమెరికా కూడా దావూద్‌ను కనుగొనేందుకు నిఘాను పెంచిన నేపథ్యంలో ఐఎస్ఐ అతడిని అత్యంత రహస్య ప్రాంతానికి తరలించింది. పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దులోని సదరు ప్రాంతాన్ని ఇతర దేశాల నిఘా సంస్థలు గుర్తించడం కష్టమన్న భావనతోనే ఐఎస్ఐ అతడిని అక్కడికి తరలించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+