వర్త్ వర్మా వర్త్.. కళ్లు చెదిరిపోయేలా ఉంది! 3,150 వజ్రాలతో సరికొత్త కిరీటం

ప్రపంచ సుందరి కిరీటం కోసం 121 దేశాల అందగత్తెలు పోటీపడుతున్న వేళ, మిస్ యూనివర్స్ వేదికపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ అంతర్జాతీయ అందాల పోటీ 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వాహకులు సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. నవంబర్ 24న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు ముందు, పోటీదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఏకంగా 3,150 వజ్రాలతో పొదిగిన ఈ అపురూప కిరీటాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

'ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ' ప్రత్యేకతలివే!

నవంబర్ 13న జరగనున్న స్విమ్‌సూట్ రన్‌వే ప్రదర్శనకు ఒకరోజు ముందు, అంటే నవంబర్ 12న మిస్ యూనివర్స్ నిర్వాహకులు ఈ కిరీటాన్ని ఆవిష్కరించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దీని తొలి లుక్‌ను పంచుకుంటూ.. దీనికి 'ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. మిస్ యూనివర్స్ గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రతీకగా నిలిచే ఈ కిరీటాన్ని ప్రముఖ డిజైనర్లు జార్జ్ విట్టెల్స్, మైసన్ డి ఓఆర్ రూపొందించారు. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా 3,150 వజ్రాలతో దీనిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

Miss Universe Unveils New Crown Adorned With 3 150 Diamonds to Celebrate 75-Year Pageant Legacy Ahead of Finale

75 ఏళ్ల ప్రస్థానంలో మారిన 12 కిరీటాలు

మిస్ యూనివర్స్ చరిత్రలో ప్రతి మైలురాయికి గుర్తుగా నిర్వాహకులు కొత్త కిరీటాలను తీసుకొస్తూనే ఉన్నారు. గడిచిన 75 ఏళ్లలో మొత్తం 12 రకాల కిరీటాలు విజేతల శిరస్సును అలంకరించాయి. 1952లో తొలిసారిగా 1,529 వజ్రాలతో కూడిన 'రోమనోవ్ ఇంపీరియల్' కిరీటాన్ని ఆర్మీ కుసేలా గెలుచుకున్నారు. ఆ తర్వాత 1953లో కాంస్యంతో చేసిన 'క్రిస్టియన్ మార్టెల్' కిరీటం, 1954-60 మధ్య వెయ్యి నల్ల ముత్యాలతో చేసిన 'స్టార్ ఆఫ్ ది యూనివర్స్' కిరీటం ప్రాచుర్యం పొందాయి. 1963 నుంచి 2001 వరకు సుదీర్ఘకాలం పాటు సారా కోవెంట్రీ డిజైన్ చేసిన 'లేడీ క్రౌన్' కొనసాగింది.

Miss World 2026: విశ్వసుందరిగా జోహైరీ మోలా.. 75 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా
Miss World 2026: విశ్వసుందరిగా జోహైరీ మోలా.. 75 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా

ఆధునిక హంగులతో ఆకట్టుకున్న కిరీటాలు

2002 తర్వాత కిరీటాల డిజైన్లలో భారీ మార్పులు వచ్చాయి. 500 వజ్రాలు, 120 ముత్యాలతో కూడిన 'మికిమోటో ఫీనిక్స్' కిరీటం, వియత్నాంలో 1,000 విలువైన రాళ్లతో చేసిన 'సీఏఓ' కిరీటం ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహనకు ప్రతీకగా 2009-13 మధ్య కృత్రిమ కెంపులతో 'డైమండ్ నెక్సస్ పీస్' కిరీటాన్ని వాడారు. ఆ తర్వాత 62.83 క్యారెట్ల బంగారు వజ్రంతో కూడిన 'పవర్ ఆఫ్ యూనిటీ', 110 క్యారెట్ల నీలమణులతో చేసిన 'ఫోర్స్ ఫర్ గుడ్', అలాగే 2024-25లో 23 బంగారు ముత్యాలతో తీర్చిదిద్దిన 'లూమియర్ డి ఎల్ ఇన్ఫిని' కిరీటాలు విజేతలకు అందాయి.

భారత్ ఆతిథ్య హక్కులు రద్దు.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బిగ్ షాక్
భారత్ ఆతిథ్య హక్కులు రద్దు.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బిగ్ షాక్

భారత్ తరఫున బరిలో కేరళ సుందరి

నవంబర్ 24న శాన్ జువాన్‌లోని జోస్ మిగ్యుల్ అగ్రెలోట్ కొలీజియంలో జరగనున్న మిస్ యూనివర్స్ 2026 గ్రాండ్ ఫినాలే కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 121 దేశాల సుందరీమణులు తలపడుతున్న ఈ ప్రతిష్టాత్మక వేదికపై భారతదేశం తరఫున కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సరికొత్త వజ్రాల కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+