27మంది భార్యలు. 145 మంది సంతానం: అతడు ప్రభుత్వానికే సవాల్

కెనడా: చాలా దేశాల్లో బహుభార్యత్వం అమలులో లేదు. ఆ దేశాల్లో కెనడా కూడా ఒకటి. అయితే, కెనడాలో ఓ వ్యక్తి మాత్రం 27మంది మహిళలకు భర్త ఉన్నాడు. వారికి 145మంది సంతానం కూడా ఉన్నారు. అయితే, తాను 27మందిని చట్టబంధంగా వివాహం చేసుకోలేదని, వారందరూ తన స్నేహితురాళ్లేనంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరాడు.

వివరాల్లోకి వెలితే.. ఆయన పేరు విన్‌స్టన్ బ్లాక్ మోర్(59). బహుభార్యత్వంలో కెనడాలో ఈయనే టాప్. మొత్తం 27 మంది భార్యలు. 145 మంది సంతానం. కెనడాలోని పోలీగామస్ మోర్మోన్ ఫండమెంటలిస్ట్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న బ్లాక్‌మోర్‌ పోలీగామస్ ఫండమెంటలిస్ట్ చర్చ్‌ బిషప్.

బహుభార్యత్వం కింద 2007లో పోలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2014లో మరోమారు కేసు పెట్టారు. అయితే ఇప్పటి వరకు విచారణ మాత్రం జరగలేదు. తనను కేసులతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న ప్రభుత్వం.. ఆ పనిచేయాలంటే వివాహ చట్టాన్ని సవరించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు బ్లాక్‌మోర్.

తన భార్యలందరూ తనకు స్నేహితురాళ్లు మాత్రమేనని, తన పెళ్లిళ్లు చట్టబద్ధం కాదని వాదిస్తున్నాడు. తాను ఎవరినీ అధికారికంగా పెళ్లి చేసుకోకపోయినా పోలీసులు మాత్రం ఇప్పటికీ తనపై బహుభార్యత్వం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని వాపోతున్నాడు.

Man with 27 wives and 145 children doesn't want polygamy to be legalised

బహుభార్యత్వాన్ని చట్టబద్ధం చేయడానికి తాను వ్యతిరేకినని చెబుతున్న బ్లాక్‌మోర్.. అదే కనుక జరిగితే మహిళలు మోసానికి గురవుతారని పేర్కొన్నాడు. 2007లో తనపై కేసు నమోదు చేసిన పోలీసులు బహుభార్యత్వాన్ని నిరూపించలేక కేసు కొట్టేశారన్నాడు.

అయినా మరోమారు 2014లో ఇదే కేసు నమోదుచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యలందరూ తనకు 'స్నేహితురాళ్లు' మాత్రమేనని, పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకుని తనపై నమోదు చేస్తున్న కేసులకు ముగింపు పలకాలని బ్లాక్‌మోర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. కాగా, బ్లాక్‌మోర్ 2001, 2002లో రెండో పెళ్లి, సవతి భార్య కుమార్తె(13)పై రేప్ కేసులో దోషిగా తేలాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+