43ఏళ్ల తర్వాత: కృత్రిమ పురుషాంగంతో సెక్స్

లండన్: ఓ వ్యక్తి ఆరేళ్ల వయసులోనే తన పురుషాంగాన్ని కోల్పోయాడు. ఇటీవలే అతనికి కృత్రిమ పురుషాంగాన్ని అమర్చారు. దీంతో 43ఏళ్ల తర్వాత అతను శృంగారంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అతనే స్కాట్లాండ్‌కు చెందిన 43ఏళ్ల మొహమ్మద్ అబాద్.

కాగా, వచ్చే వారమే అతను తొలిసారి శృంగారంలో పాల్గొననున్నాడు. తన కృత్రిమ పురుషాంగంతో ఓ సెక్స్ ప్రచారకర్తతో శృంగారం చేయనున్నాడు. 35ఏళ్ల సెక్స్ వర్కర్ చార్లెట్ రోజ్ అబాద్‌తో పడకను పంచుకోనుంది.

‘ఈ సమయం కోసం ఎన్నాళ్లో ఎదురుచూశా. కొత్త ఏడాదికి ఇది మంచి స్టార్ట్ అవుతుంది. పురుషాంగం పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఎంతో సంతోషంగా ఉంది. భావోద్వేగాన్ని ఇంకా ఆపుకోలేనని' అబాద్ ఈ సందర్భంగా తెలిపాడు.

Man with bionic penis to finally lose virginity with London sex worker

ఆరేళ్లప్పుడు కారు ఢీకొనడంతో అబాద్ పురుషాంగాన్ని కోల్పోయాడు. ఆ ఘటనలో అతని తొడ భాగంతో పాటు పురుషాంగం, వృషణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2012లో అబాద్ ఎనిమిది ఇంచుల కృత్రిమ పురుషాంగాన్ని అమర్చుకున్నాడు. 2015లో జులైలో మరోసారి ఆపరేషన్ చేసిన తర్వాత అతని పురుషాంగం పనిచేయడం ప్రారంభించింది. శస్త్ర చికిత్స జరిగిన 15 రోజుల తర్వాత అబాద్ అంగం స్తంభించింది.

సెక్స్ స్వేచ్ఛ ఉద్యమకారిణి చార్లెట్ రోజ్‌తో అబాద్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ వచ్చే వారం లండన్‌లో ఓ హోటల్‌లో కలుసుకోనున్నారు. అబాద్‌తో శృంగార బంధాన్ని కొనసాగించడం గర్వంగా ఉందని రోజ్ తెలిపింది. అయితే కృత్రిమ పురుషాంగం పెట్టుకోక ముందే అబాద్‌కు పెళ్లి జరిగింది. కానీ, అబాద్‌కు పురుషాంగం లేదని తెలుసుకున్న భార్య అతన్ని రెండేళ్ల క్రితమే వదిలేసింది.

కాగా, కృత్రిమ పురుషాంగంలో రెండు ట్యూబ్‌లు ఉంటాయి. కడుపు నుంచి వచ్చే ద్రవం ఆ ట్యూబుల్లో అంగ స్తంభన కలిగిస్తుంది. అంగ కదిలికలను వృషణాల్లో ఉన్న ఆన్-ఆఫ్ బటన్లతో ఆపరేట్ చేస్తారు. ఎడమ చేయి మాంసం నుంచి ఆ కృత్రిమ అంగాన్ని తయారు చేశారు. లండన్ యూనివర్సిటీ కాలేజీ డాక్టర్లు ఆ అంగాన్ని అమర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+