రూ.9కోట్ల లాటరీ తగిలినా, కూలీ పనికే సిద్ధమయ్యాడు

లండన్: ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. అతను కోటీశ్వరుడయ్యాడు. అయినప్పటికీ తన పాత వృత్తిని మానుకోనని చెబుతున్నాడు. తాను కూలీ పని చేసేవాడినని, ఇప్పుడు అదే చేస్తానని చెబుతున్నాడు. అయితే, కేవలం ఓవర్ టైమ్ చేయడం మాత్రమే మానేస్తానని చెప్పాడు.

సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలి కోట్లు వచ్చినా, అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినా కార్లు కొంటారు. భవంతులు కొంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, ఏదైనా చిన్న పని చేసి ఉంటే లాటరీ తగలగానే మానేయడానికే చూస్తారు.

Manchester road worker Carl Crook wins £1m with Lotto scratchcard before going back to work

కానీ లండన్‌కు చెందిన కార్ల్ క్రూక్ మాత్రం తాను మళ్లీ నిర్మాణ పనుల్లో కూలీకి వెళ్తానని చెప్పాడు. ఓసారి కార్ల్ స్థానిక దుకాణంలో కూల్ డ్రింక్ కొన్నాడు. ఓ స్కాచ్ కార్డ్ వచ్చింది. దాని ద్వారా అదృష్టం కలిసొచ్చింది. ఏకంగా రూ.9 కోట్ల కంటే ఎక్కువగా లాటరీ తగిలింది. దీంతో అతను అనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

తాను తన వృత్తిని మానుకోనని, కూలీ పని చేస్తున్నప్పుడే తాను ఇక్కడ ఎందుకు ఉన్నానని అనుకునేవాడినని, కానీ తనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ నచ్చిందని, ఈ పని కొనసాగిస్తానని తన యజమానికి కూడా చెప్పానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+