వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనిషి మెదడుతో సమానంగా: ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ వచ్చేసింది

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ఆన్ అయ్యింది. దీన్ని మాంచెస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు రూపొందించారు. న్యూరోమార్ఫిక్ సూపర్ కంప్యూటర్‌గా పిలువబడే ఈ కంప్యూటర్‌ను పరిశోధకులు స్విచ్ ఆన్ చేశారు. ఈ కంప్యూటర్ ప్రత్యేకత ఏమిటంటే అచ్చం మనిషి మెదడులా పనిచేస్తుంది.

మెదడులోని నరాలులా పనిచేసే స్పైక్స్

మెదడులోని నరాలులా పనిచేసే స్పైక్స్

మనిషి మెదడులో నరాలు ఎలాగైతే ఉంటాయో అవి ఎలాగైతే పనిచేస్తాయో న్యూరోమార్ఫిక్ సూపర్ కంప్యూటర్‌లో కూడా స్పైక్స్ ఉంటాయి. ఇవే నరాలుగా పనిచేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే కృత్రిమ మెదడులా పనిచేస్తాయి. విద్యుత్ రసాయన చర్య (ఎలక్ట్రో కెమికల్ ఎనర్జీ)ద్వారా ఈ సూపర్ కంప్యూటర్ పనిచేస్తుంది. ఈ అద్భుతమైన కంప్యూటర్‌ను రూపొందించేందుకు మాంచెస్టర్ పరిశోధకులు ఒక మిలియన్ ప్రాసెసర్లు అమర్చారు. దీంతో ఒక్క కంప్యూటర్‌లో ఇన్ని ప్రాసెసర్లు వినియోగించడం ఒక రికార్డుగా చెప్పొచ్చు.

స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌తో పనిచేసే సూపర్ కంప్యూటర్

స్పైకింగ్ న్యూరల్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌తో పనిచేసే సూపర్ కంప్యూటర్

సూపర్ కంప్యూటర్ పనిచేయాలటే ఒక మిలియన్ ప్రాసెసర్లు ఉండాల్సిందే. మనిషి మెదడు ఎలాగైతే పనిచేస్తుందో అంతకు మించి ఆలోచించేలా సూపర్ కంప్యూటర్‌ను రూపొందించినట్లు పరిశోధకులు చెప్పారు. ఇందుకోసం స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ (స్పైన్నేకర్) అమర్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ సెకనుకు 200 ట్రిలియన్ల యాక్షన్లు చేయగలదని పరిశోధకులు చెప్పారు.

సూపర్ కంప్యూటర్‌తో శాస్త్ర సాంకేతిక, వైద్యరంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు

సూపర్ కంప్యూటర్‌తో శాస్త్ర సాంకేతిక, వైద్యరంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు

సాధారణ కంప్యూటర్లలా కాకుండా స్పైన్నేకర్ ఒక చోట నుంచి మరో చోటికి సమాచారం పంపదన్నారు. ఇందుకు భిన్నంగా ఒకే సారి కొన్ని బిలియన్ల సమాచారంను కొన్ని వేల లొకేషన్లకు ఒకే సారి పంపుతుందని మాంచెస్టర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సూపర్ కంప్యూటర్ ఆలోచనాకర్త స్టీవ్ ఫర్బర్ చెప్పారు. స్పైన్నేకర్ అచ్చం మనిషి మెదడులా పనిచేస్తుంది కాబట్టి శాస్త్ర సాంకేతిక విభాగం, వైద్యరంగంలో కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన చెప్పారు. 20 ఏళ్ల క్రితం ఈ సూపర్ కంప్యూటర్‌కు బీజం పడగా... దీన్ని పూర్తి చేసేందుకు 10 ఏళ్ల సమయం పట్టినట్లు పరిశోధకులు చెప్పారు. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చని రూపకర్తలు చెబుతున్నారు.

English summary
Researchers at Manchester University have just switched on the world’s largest neuromorphic supercomputer.A neuromorphic supercomputer, in case you’re unfamiliar, mimics the biological neural activities of a human brain by emitting “spikes” of pure electro-chemical energy. To achieve this, scientists at Manchester University built the computer with one million processors at its core, which admittedly seems like a lot of processors for one computer to have.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X