అరగంటలో రెండుసార్లు భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
మణిపూర్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 5.2 తీవ్రతగా నమోదైంది. మణిపూర్ లోని చురచంద్ పుర్ జిల్లాలో అర్థరాత్రి ఒంటి గంట 54 నిమిషాలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణహాని కలగలేదని తెలిపింది.
మణిపూర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా అరగంట వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది. అర్ధరాత్రి ఒంటి గంట 54 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఓ ప్రకటనలో తెలిపింది.
మణిపూర్ లో కేవలం 30నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు అతలాకుతలం చేశాయి. చురచంద్ పూర్ లో రిక్టార్ స్కేలుపై 5.2తీవ్రత నమోదు అయింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే నోనీ ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై 2.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్ల లేదని తెలిపింది.

భూకంపం తెల్లవారుజామున 1 గంట 54 నిమిషాలకు 24.46 N అక్షాంశం, 93.70 E రేఖాంశం వద్ద సంభవించిందని అధికారులు స్పష్టం చేశారు. భూకంపం 40 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించారు. అయితే ఈ భూకంపం వచ్చిన కొద్ది నిమిషాలకే మణిపూర్ లోని నోనీ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై 2.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ స్పష్టం చేసింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 2:26 గంటలకు 24.53 N అక్షాంశం, 93.50 E రేఖాంశం వద్ద సంభవించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్ల లేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
EQ of M: 3.9, On: 28/05/2025 10:23:55 IST, Lat: 24.55 N, Long: 93.70 E, Depth: 36 Km, Location: Churachandpur, Manipur.
— National Center for Seismology (@NCS_Earthquake) May 28, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/tautxm3soy
నేపాల్, మయన్మార్, మణిపూర్ ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా నమోదవుతూ ఉంటాయని అధికారులు వివరించారు. ఈ ప్రాంతంలోని టెక్టోనిక్ ప్లేట్స్ కారణంగా భూమిలోపల ప్రకంపనలు సంభవిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications