Joe Biden: చిక్కుల్లో యూఎస్ ప్రెసిడెంట్‌ జో బిడెన్.. ఆ పత్రాల్లో ఏముందంటే..!

బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కాలం నాటి క్లాసిఫైడ్ డాక్యుమెంట్‌లు వాషింగ్టన్ థింక్ ట్యాంక్ వద్ద దొరికాయని వైట్ హౌస్ సోమవారం తెలిపింది. బైడెన్‌ పాత కార్యాలయంలో ఉక్రెయిన్‌, ఇరాన్‌, యూకేకు సంబంధించిన సున్నితమైన అంశాలకు చెందిన ఫైల్స్‌ ఉన్నట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. బిడెన్ తరపు న్యాయవాదులు గత నవంబర్‌లో కార్యాలయ స్థలాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు ఈ పత్రాలను కనుగొన్నారు.

పత్రాలను సమీక్షించడానికి అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చికాగోలోని యుఎస్ అటార్నీని అప్పగించారని, ఎఫ్‌బిఐ కూడా దర్యాప్తు చేస్తోందని సిబిఎస్ న్యూస్ నివేదించింది. ఈ పత్రాలు నవంబర్ లోనే బయటపడినప్పటికీ.. ఎన్నికలు ఉండడం వల్ల బయటకు పొంకనివ్వలేదని విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ మధ్య జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు మధ్య పోరు హోరాహోరీగా సాగింది.
రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ మాత్రమే వచ్చింది.

Many important documents have been discovered in the old office of US President Joe Biden

అధ్యక్షుడు జో బిడెన్ మాజీ ప్రైవేట్ కార్యాలయంలో థింక్ ట్యాంక్‌లో క్లాసిఫైడ్ అని మార్క్ చేసిన ఫైల్‌లు ఎలా దొరికయో దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్ కమిటీ తెలిపింది. మెక్సికో సిటీలో ఒక శిఖరాగ్ర సమావేశానికి హాజరైన బిడెన్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విషయం తనను ఆశ్చర్య పరిందన్నారు. "పత్రాలలో ఏముందో నాకు తెలియదు," అని చెప్పారు. విషయాల గురించి విచారించవద్దని తన లాయర్లు తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నాడు.

"మేము సమీక్షకు పూర్తిగా సహకరిస్తాం" అని బిడెన్ తెలిపారు. కాగా ట్రంప్, బైడెన్‌ ఇద్దరూ రహస్య పత్రాలను ప్రైవేటు కార్యాలయాలకు పట్టుకెళ్లారు. బైడెన్‌ వద్ద ఇప్పటి వరకు 10 పత్రాలు బయటపడగా.. ట్రంప్‌ వద్ద 325 దొరికినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+