టోర్నడోకు తోడుగా పెను తుఫాన్: 23 మంది దుర్మరణం- పలువురు గల్లంతు
వాషింగ్టన్: అమెరికాలో టోర్నడోలు బీభత్సాన్ని సృష్టించాయి. వీటికి పెను తుఫాన్ కూడా తోడు కావడంతో దాని తీవ్రత భారీగా కనిపించింది. మరింత నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 23 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. పలు నివాసాలు నేలమట్టం అయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి స్థానికులు చెల్లాచెదురు అయ్యారు. కొన్ని కిలోమీటర్ల వరకు దీని ప్రభావం పడింది.
అమెరికాలో టోర్నడోలు ఏర్పడటం సహజమే. క్యుములోనింబస్ మేఘాలు అలముకున్నప్పుడు ఇవి ఏర్పడుతుంటాయి. ట్విస్టర్, విర్ల్ విండ్, సైక్లోన్ గా పిలుస్తుంటారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతుంటాయి టోర్నడోలు. భూ ఉపరితలం నుంచి 80 మీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తాయి. అదే వేగంతో కొన్ని కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంటాయవి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కోసారి గంటకు 480 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వాటికి ఉంటుంది. దీని రేడియస్ మూడు కిలోమీటర్ల వరకు కూడా విస్తరిస్తుంటుంది.

అలాంటి టోర్నడోలు మిసిసిపిని వణికించాయి. విధ్వంసాన్ని సృష్టించాయి. వందల సంఖ్యలో నివాసాలను నేలమట్టం చేశాయి. మిసిసిపీ సిల్వర్ సిటీ, హంఫ్రేస్ కంట్రీపై విరుచుకుపడ్డాయి. మిసిసిపి పశ్చిమ ప్రాంతంలో ఉంటుందీ టౌన్. సుడిగాలుల ధాటికి భారీ వస్తువులు సైతం చిత్తు కాగితాల్లా గాల్లోకి లేచాయి. ఈ ఘటనలో 23 మందికి పైగా మరణించారు. పలువురు గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు. గాయపడ్డ వారికి తక్షణ వైద్య సహాయాన్ని అందిస్తోన్నామని మిసిసిపి గవర్నర్ టేట్ రీవ్ తెలిపారు.
A tornado has touched down in Silver City, MS, in Humphreys County. Highway 49W is congested at this time with emergency crews. Please use an alternate route if possible. pic.twitter.com/npfYxnMGSN
— MHP Greenwood (@MHPTroopD) March 25, 2023
ప్రాణనష్టాన్ని తగ్గించడానికి అన్ని చర్యలను తీసుకున్నట్లు టేట్ రీవ్ చెప్పారు. సహాయ కార్యక్రమాలను చేపట్టామని, భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన వెలికి తీస్తోన్నామని పేర్కొన్నారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయిందని, సహాయ కార్యక్రమాలకు కొంత అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానించారు. సిల్వర్ సిటీ మీదుగా రాకపోకలను నిషేధించామని, టోర్నడో ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాత పునరుద్ధరిస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications