మావో తప్పులు చేశారు: జిన్‌పింగ్ సంచలన వ్యాఖ్య

మావో గొప్ప వ్యక్తి, చైనా ముఖచిత్రాన్ని మార్చివేసి చైనీయులకు కొత్త జీవితాలను ప్రసాదించాడు. ఆయన గొప్ప వ్యూహకర్త, సిద్ధాంతవేత్త, అట్టడగు స్థాయినుంచి విప్లవాన్ని రగిలించిన నేత' అని ప్రశంసించాడు. మరోవైపు మావో తన బాల్యాన్ని గడిపిన షావోషాన్ హునాన్‌లోని ఇంటివద్ద భారీ సంఖ్యలో చైనీయులు గుమికూడి బాణాసంచా కాల్చారు.
మావోపై చైనా చరిత్రకారుల్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మావో వినాశకర విధానాలైన ‘గ్రేట్ లీప్ ఫార్వార్డ్'(గొప్ప ముందడుగు)ను సరైన రీతిలో మదింపుచేయాల్సి ఉందని చరిత్రకారులు అంటున్నారు. ఆయన చేపట్టిన రాజకీయ, ఆర్థిక విధానాల మూలంగా లక్షల మంది మృత్యువాత పడ్డారని కొంతమంది విమర్శిస్తున్నారు.
మరోవైపు ‘విప్లవ నేతలందరూ దేవుళ్లు కాదు, వారంతా మానవులే' అని గ్జిజిన్‌పింగ్ అన్నట్లు అక్కడి అధికార పత్రిక గ్జిన్‌హువా చెప్పింది. ‘మేము వారిని దేవుళ్లను పూజించిన రీతిలో పూజించం లేదా వారు కేవలం గొప్పవారన్న ప్రాతిపదికపై ప్రజలు వారిలో తప్పులు లేవనెత్తటాన్ని, సరిదిద్దడాన్ని అడ్డుకోం, అదేరీతిలో వారు తప్పులుచేశారని వారిని చరిత్రనుంచి తొలగించే సాహసం చేయం' అని గ్జి జిన్‌పింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications