వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో స్నేహితులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితుడు ఉండే ప్రదేశాన్ని సులభంగా గుర్తించే సదుపాయాన్ని భారత సంతతికి చెందిన నిపుణుడు అరాన్ ఖన్నా అభివృద్ధి చేశారు. మస్సాచుసెట్స్‌లోని క్రేంబిడ్జిలో సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన విద్యార్థి అయిన అరాన్ ఖన్నా ఇందుకోసం మరాడ్యూర్స్ మ్యాప్ అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు

ఈ ఎక్స్‌టెన్షన్ ఫేస్‌బుక్ మెసెంజర్ నుంచి డాటాను సేకరించి ఫేస్‌బుక్ యూజర్ స్నేహితుడి ప్రదేశాన్ని మ్యాప్‌పై చూపిస్తుంది. మెసెంజర్స్ వెబ్ ఇంటర్ఫేస్‌లో మ్యాప్‌ను ఈ ఎక్స్‌టెన్షన్ లోడ్ చేస్తుంది.

Map to tell your Facebook friend's location

సందేశాలను పంపే ప్రదేశం నుంచి డాటాను ఈ ఎక్స్‌టెన్షన్ తీసుకుంటుందని, యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్‌ను నెటిజన్లు ఎంచుకోవాలని సూచించారు.

లొకేషన్ షేరింగ్‌ను మీ మొబైల్‌లో ఎనేబుల్ చేసుకుంటేనే ఇతరులు మీరెక్కడున్నారో తెలుసుకోవడానికి వీలవుతుంది. మీరు ఎక్కడున్నారో ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేకుంటే దీన్ని డిసెబుల్ చేసుకుంటే చాలు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్‌లపై ఇది పనిచేస్తుంది.

English summary
You can now easily know the exact location of your Facebook friends, thanks to a new creepy Google chrome extension developed by an Indian-origin researcher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X