నల్ల జాతీయుడు: 16 సార్లు కాల్చేశాడు (వీడియో)
చికాగో: చేతిలో ఏదో చిన్న వస్తువు పెట్టుకుని వెలుతున్న వ్యక్తిని పోలీసు పిట్టను కాల్చినట్లు నడిరోడ్డు మీద కాల్చి చంపేసిన సంఘటన చికాగో నగరంలో జరిగింది. సంవత్సరం తరువాత ఆ క్లిప్పంగ్స్ బయటకు రావడంతో నల్ల జాతీయులు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
2014 అక్టోబర్ 20వ తేది రాత్రి 9.45 గంటల సమయంలో మెక్ డోనాల్డ్ (17) అనే నల్ల జాతి యువకుడు చేతిలో కత్తి లాంటి వస్తువు పట్టుకుని రోడ్డు మీద నడిచి వెలుతున్నాడు. అదే సమయంలో పోలీసులు అటు వైపు వచ్చారు.
యువకుడిని గుర్తించి నడిరోడ్డు మీద పోలీసు వాహనం నిలిపివేశారు. తరువాత ఆ యువకుడు భయంతో రోడ్డు దాటడానికి పరుగు తీశాడు. అంతే ఇద్దరు పోలీసులలో ఒకరైన వ్యాన్ డైక్ అనే వ్యక్తి యువకుడి కాలిలోకి బుల్లెట్ దించాడు.

అతను కిందపడిపోయి కాలు దగ్గరగా లాక్కోంటున్న సమయంలో వరుసగా అతని శరీరంలోకి 15 బుల్లెట్లు దిగిపోయాయి. కనీసం లొంగిపోవాలని చెప్పలేదని, అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించలేదని ఆ క్లిప్పింగ్స్ లో స్పష్టం అవుతున్నది.
ఆ సీసీ టీవీ క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. నల్లజాతీ పౌరులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కేసు నమోదు కావడంతో కోర్టు పోలీసు వ్యాన్ డైక్ మీద మండిపడింది. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నల్ల జాతీయులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications