ఆరుబయట మందు, శృంగారం: మహిళలు, పురుషులు అరెస్ట్
దుబాయ్: గత ఏడాది అక్టోబర్ నెలలో దుబాయిలో ఓ పార్టీ సమయంలో బహిరంగంగా అల్కాహాల్ తీసుకున్నారని, శృంగారంలో పాల్గొన్నారని ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎమిరేట్స్ మహిళలు, మరో మహిళను అరెస్టు చేశారు. వారికి ఏడాది జైలు శిక్ష విధించారు.
ఆ సంఘటన జరిగినప్పుడు పార్టీ సమయంలో ఈ ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు మరో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు. మిగతా వారికి రెండువేల దినార్ల జరిమానా విధించారు.

గత ఏడాది అరెస్టయిన సమయంలో ఓ ఎమిరేట్స్ వ్యక్తి (43) మహిళా డ్రెస్సింగ్‌లో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు మహిళలు పార్టీలో ఆల్కాహాల్ తీసుకుంటూ, పెయిడ్ సెక్స్‌కు పాల్పడుతున్నారని సమాచారం అందటంతో నాడు పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు దుబాయిలోని మెరినాలో సెలవులు గడిపేందుకు వచ్చారని తెలుస్తోంది. నాడు పోలీసులు 20-36 ఏళ్ల మధ్య ఉన్న 13 మంది మహిళలు, 21-43 ఏళ్ల మధ్య ఉన్న పదిహేను మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అందరు తాగి ఉన్నారు. పోలీసులు 101 బాటిల్స్ ఆల్కాహాల్ స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications