వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌పై భారత నెటిజన్ల ఫైర్: బాధపడ్డ జుకర్‌బర్గ్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: నెట్ న్యూట్రాలిటీపై ఫేస్‌బుక్ బోర్డు సభ్యుడు మార్క్ ఆండ్రీసేన్ చేసిన ట్వీట్‌పై భారత నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వివక్షపూరిత ఇంటర్నెట్ టారీఫ్‌ను అడ్డుకుంటూ.. నెట్ న్యూట్రాలిటీని పరీక్షిస్తూ.. టెలికాం రెగ్యూలేటర్ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై ఫేస్‌బుక్ బోర్డు సభ్యుడు ఆండ్రీ సేన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.

ట్రాయ్‌ తీసుకున్న నిర్ణయాన్ని వలసవాద భావజాలంగా పేర్కొంటూ ఆండ్రీసేన్‌ ట్వీట్‌ చేశారు. దేశ ప్రజలకు ఇలాంటి నిర్ణయాలు ఎంతమాత్రం దోహదపడవని పేర్కొన్న ఆయన, ఈ భావజాలం దేశాన్ని ఆర్థికంగా దశాబ్దాల పాటు వెనక్కు నెడతాయని అన్నారు. అంతేగాక, భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉంటేనే మంచి నిర్ణయాలు వచ్చి ఉండేవని వ్యాఖ్యానించాడు.

కాగా, ఆండ్రీసేన్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆండ్రీసేన్‌ తన వివాదాస్పద ట్వీట్‌ని వెనక్కు తీసుకున్నారు. ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్‌ను కొందరు ఇంటర్నెట్ వలసవాదంగా సైతం అభివర్ణించారు. మరికొందరు ఈస్ట్ ఇండియా కంపెనీ వలసవాదానికి ‘సరికొత్త కొనసాగింపు'గా ఫేస్‌బుక్‌ను అభివర్ణించారు.

Mark Zuckerberg reacts to board member's India comments

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్‌ బుధవారం దీనిపై వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌ బోర్డ్‌ మెంబర్‌ మార్క్‌ ఆండ్రీసేన్‌ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఆండ్రీసేన్‌ చేసిన వ్యాఖ్యలు తనకు బాధకలిగించాయన్నారు. వ్యక్తిగతంగా తనకు, ఫేస్‌బుక్‌కి భారత్‌ ఎంతో ప్రాముఖ్యమని చెప్పారు.

తాను భారత్‌లో పర్యటించినప్పుడు అక్కడి ప్రజల మానవత్వం, వారు పాటించే విలువలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ వారి అనుభవాలను పంచుకోగలిగినప్పుడు మరింత ఎక్కువ పురోగతి సాధించగలరనేది తనకు అర్థమైందని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు.

I want to respond to Marc Andreessen's comments about India yesterday. I found the comments deeply upsetting, and they...

Posted by Mark Zuckerberg on Wednesday, February 10, 2016

English summary
Ever the diplomat, Mark Zuckerberg has cleared the air regarding one of his board member's comments on India. On Tuesday, venture capitalist Marc Andreessen, who's a Facebook (FB, Tech30) board member, posted a series of controversial tweets on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X