జుకర్ బర్గ్ కూతురు తొలి పలుకు ఇదే
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ కుమార్తె తొలి పలుకు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. జుకర్ కుమార్తె లిటిల్ మ్యాక్స్ తొలిసారిగా డాగ్ అని పలికింది.
పెంపుడు కుక్క బీస్ట్‌ను మ్యాక్స్ అమితంగా ఇష్టపడుతుందని, తొలిసారిగా డాగ్ అని పలికిందని జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఫోటోలతో పోస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో మ్యాక్స్ జన్మించింది. కూతురు పుట్టిన అనంతరం జుకర్‌బర్గ్ తండ్రిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.

గతంలో తన చిన్నారి పాప మ్యాక్స్ జుకర్‌బర్గ్‌తో ఉన్న పలు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు కూతురు తొలి పలుకులకు ముచ్చటపడుతూ ఆనందాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. సుమారు ఏడాది వయసున్న తన బుజ్జాయి పలకడం ప్రారంభించిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications