అద్భుతం-ప్రేమకు ప్రతిరూపం: ‘తాజ్’పై జుకర్‌బర్గ్
న్యూఢిల్లీ: తాజ్ మహల్ ఓ అద్భుత కట్టడమని, అది ప్రేమకు ప్రతిరూపమని ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఆయన మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్‌ను ఫేస్‌బుక్ సందర్శించారు.
అక్టోబర్ 28న జుకర్ బర్గ్ ఢిల్లీలోని ఐఐటీలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారతదేశానికి వచ్చిన జుకర్ బర్గ్ మంగళవారం తాజ్‌మహల్‌ను సందర్శించి, అక్కడ తాను దిగిన ఫొటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తాను అనుకున్న దాని కన్నా తాజ్ మహల్ చాలా అందంగా ఉందని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. ప్రేమే ఈ అద్భుత కట్టడానికి కారణమని చెప్పారు. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ గొప్పతనం మాటల్లో చెప్పలేమని ఆయన అన్నారు.
‘ఇండియాలో 130మిలియన్లకు పైగా ఫేస్‌బుక్ వినియోగదారులున్నారు. అందుకే వారి నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు ముందుకు వస్తున్నా' అని ఇటీవల జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications