Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రీన్ కార్డుపై బాంబు పేల్చిన అమెరికా

Green Card: అమెరికాలో గ్రీన్ కార్డ్‌ పొందడం వలసదారులకు అత్యంత ప్రతిష్టాత్మకం. గ్రీన్ కార్డ్ హోల్డర్‌లు పూర్తి స్థాయి అమెరికా పౌరులతో సమానం కాకపోయినప్పటికీ.. అక్కడి వారికి లభించే అనేక హక్కులు లభిస్తాయి. దీన్ని పొందడానికి విదేశీయులు సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి- ఆ దేశ పౌరుడిని వివాహం చేసుకోవడం. ఇకపై ఇది చెల్లుబాటు కాకపోవచ్చు. విదేశీయులు అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని దక్కించుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి.

అమెరికా పౌరుడిని వివాహం చేసుకుంటే గ్రీన్ కార్డ్‌ దక్కుతుందనడానికి ఎటువంటి హామీ ఉండదని ఇమ్మిగ్రేషన్ అటార్నీ జనరల్ బ్రాడ్ బెర్న్‌స్టీన్ స్పష్టం చేశారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడానికి అమెరికన్ పౌరుడిని వివాహం చేసుకోవడం, దానికి సంబంధించిన వివాహ ధృవీకరణ డాక్యుమెంట్ తేల్చి చెప్పారు. తమ దేశ పౌరుడి జీవిత భాగస్వామి అత్యంత సన్నిహిత బంధువుగా మాత్రమే గుర్తిస్తామని స్పష్టం చేశారు.

Marriage Alone Isn t Enough for a U S Green Card Expert Immigration Attorney Warns

వివాహం చేసుకుంటే సరిపోదని, దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు మరింత కఠినతరం చేయనున్నామని ఆయన హెచ్చరించారు. పెళ్లి.. గ్రీన్ కార్డ్‌ను సంపాదించిపెట్టదని, కలిసి జీవించడానికి మాత్రమే సరిపోతుందని వ్యాఖ్యానించారు. దంపతులు ప్రతిరోజూ ఒకే ఇంట్లో కలిసి నివసించకపోతే.. ఆ వివాహం డాక్యుమెంట్ల వరకే పరిమితమైనట్లు భావిస్తామని బెర్న్‌స్టీన్ వివరించారు. గ్రీన్ కార్డు కోసమే ఈ పెళ్లి జరిగినట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు.

కలిసి జీవించకపోతే గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత పౌరసత్వాన్ని పొందడానికి దాఖలు చేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని పేర్కొన్నారు. వివాహం ఆధారంగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు.. ఇక్కడి చట్టపరమైన సలహాలను తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్ చెల్లుబాటును అయిదేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డైవర్సిటీ వీసా లాటరీని సైతం రద్దు చేశామని వివరించారు.

దంపతులు వాస్తవంగా కలిసి నివసిస్తున్నారా అనే అంశంపై దృష్టి సారించామని, దంపతులు విడివిడిగా నివసిస్తున్నట్లయితే, వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తామని, దీనికి గల కారణాలపై ఆరా తీస్తామని అన్నారు. విడివిడిగా ఉండటానికి గల కారణాలు తమకు అవసరం లేదని సహజీవనం చేస్తున్నారా? లేదా అనేదే కీలక అంశమని, భార్యాభర్తలుగా నిజంగా కలిసి జీవిస్తున్నారా లేదా అనేదానిపై మాత్రమే శ్రద్ధ చూపుతామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+