భారీ కాన్వాయ్‌తో వచ్చి ప్రియురాలికి ప్రపోజ్: అరెస్ట్

ఇస్తాంబుల్: ఓ యువకుడు తన ప్రియురాలికి చాలా వైవిధ్యంగా ప్రపోజ్ చేయాలకున్నాడు.అంతవరకూ బాగానే ఉంది. అందుకు ఎంచుకున్న విధానం మాత్రం ఆ యువకుడిని జైలుకెళ్లేలా చేసింది. ఈ ఘటన టర్కీలోని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన స్నేహితురాలి ముందు వినూత్నంగా పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని భావించాడు. ప్రపోజ్ చేసేందుకు జాతీయ రహదారిపై తన స్నేహితులతో కలసి ఏడు కార్ల కాన్వాయ్‌తో వచ్చి వాటిని అడ్డంగా నిలిపాడు.

Marriage proposal causes Istanbul traffic jam

దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా, అక్కడున్న వారు ఎవరూ అప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కానీ, ఈ ఉదంతాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

వీటితో పాటు, అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో కూడా ఈ సంఘటన రికార్డు చేయబడింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పర్చి ప్రజలకు ఇబ్బంది కల్గించినందుకు ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ యువకుడిని, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్సులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+