నాసా మార్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సమస్యలు: భూ ఛాయలోకి.. టెంపరేచర్ క్షీణించి: ప్రొటెక్టివ్ మోడ్
వాషింగ్టన్: అంగారకుడిపై పరిశోధనలను కొనసాగించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తాజాగా పంపించిన స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సాంకేతిక సమస్యలు తీవ్రంగా పరిగణించదగ్గవి కావని నాసా పేర్కొంది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని కొన్ని ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఈ సమస్యలు తలెత్తాయని వెల్లడించింది. మిగిలిన పరికరాలన్నీ సజావుగా పనిచేస్తున్నాయని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
అంగారకుడిపై పరిశోధనలను నిర్వహించడానికి నాసా తాజాగా స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించిన విషయం తెలిసిందే. నాసా కొత్తగా పంపించిన రోవర్ పర్సెవెరన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రెడ్ ప్లానెట్‌పై అడుగు పెడుతుంది. అంగారకుడిపై నీటి వనరులు, జీవజాలం నివసించడానికి అనువైన పరిస్థితులు, దాని ఉపరితల వాతావరణం వంటి పలు కీలక అంశాలకు సంబంధించిన డేటాను గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌కు పంపిస్తుంది.

ఈ రోవర్ పర్సెవరెన్స్‌ను మోసుకెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌లో తాజాగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంగారక గ్రహం వైపు దూసుకెళ్తోన్న సమయంలో అనుకోకుండా భూమి నీడ ఈ స్పేస్‌క్రాఫ్ట్‌పై పడిందని, ఫలితంగా దాని టెంపరేచర్ క్షీణించిందని అన్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ తాము అంచనా వేసిన సమయం కంటే అధికంగా భూ ఛాయలో ప్రయాణించిందని పేర్కొన్నారు. ఫలితంగా స్పేస్‌క్రాఫ్ట్ టెంపరేచర్ అనూహ్యంగా తగ్గిందని తెలిపారు.
భూ ఛాయ నుంచి బయటికి వెళ్లిన అనంతరం స్పేస్‌క్రాఫ్ట్ టెంపరేచర్ యాధాతథ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు. భూ ఛాయలో ఉన్నంతసేపూ అందులోని కొన్ని పరికరాలు పని చేయడం మానేశాయని, ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ సమయంలో తాము స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రొటెక్టివ్ మోడ్‌లో ఉంచామని అన్నారు. భూమి నీడ నుంచి బయటికి వచ్చిన తరువాత మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు వివరించారు.
Recommended Video
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications