ఆడవాళ్లు జీన్స్ ప్యాంట్లు వేస్తే భూకంపాలు వస్తాయి
ఇస్లామాబాద్: మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని ఒక ఉగ్రవాద నేత అంటున్నాడు. ఆయన శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను కొట్టిపారేస్తున్నారు. వెంటనే సైన్యం రంగంలోకి దిగి జీన్స్ ప్యాంట్ లు వేసుకున్న మహిళలను పట్టుకోవాలని సూచిస్తున్నాడు.
పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా పజ్లుర్ రెహమాన్ ఇటివల ఇస్లామాబాద్ లోని ఒక హోటల్ లో విలేకరుల సమావేశం ఎర్పాటు చేసి నగ్నసత్యం చెప్పారు. భూకంపాలు ఎందుకు వస్తాయి అని సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చారు.

మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకుని తిరగడం వలనే భూకంపాలు వస్తాయని అన్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా జీన్స్ ప్యాంట్లు వేసుకునే మహిళలపై సైనిక ఆపరేషన్ ప్రారంభించాలని పాకిస్థాన్ ప్రభుత్వానికి సూచిస్తు ఉచిత సలహ ఇచ్చారు.
తాలిబన్లు పాకిస్థాన్ కు శత్రువులు కాదని, అందు వలన తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ మీద నిషేదం ఎత్తి వెయ్యాలని, సైనిక ఆపరేషన్ చెయ్యడం అనవసరమని ఈ ఉగ్రవాద నేత అంటున్నాడు.












Click it and Unblock the Notifications