అమెరికా గ్రీన్ కార్డ్ ఫీ: యూఎస్ ప్రతిపాదిత బిల్లుకు ఆమోదం లభిస్తే.. భారతీయులకు మేలే
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్నవారికి తీపి కబురు అందించినట్లయింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు జారీ బ్యాక్ లాగ్‌లో చిక్కుకున్న వారు కొంత మొత్తం చెల్లించడం ద్వారా గ్రీన్ కార్డు పొందవచ్చు. దీని వల్ల పెద్ద సంఖ్యలో భారతీయులు లబ్ధి పొందనున్నారు. అయితే, దీనికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లు చట్ట రూం దాల్చాల్సి ఉంది.
జాబ్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాల్లో ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉంది. దీంతో హెచ్1బీ పని వీసాలపై వచ్చిన వారు గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి పరిస్థతి ఏర్పడింది. ఎక్కువ జనాభా కలిగిన భారత్, చైనా వలసదారులు ఈ నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోే అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియల్ కమిటీ ప్రతిపాత బిల్లు కాపీని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయారిటీ డేట్ దాటి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందవచ్చు.

ఇక ఈబీ-5 వీసాదారులు అయితే 50వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్ కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదిత బిల్లులో గ్రీన్ కార్డుల కోసం దేశాల కోటాను ఎత్తివేయడం, హెచ్1బీ వీసా వార్షిక కోటాకు సంబంధించిన పరిమితులు ఎత్తివేయడం వంటి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని శాశ్వత నిర్మాణాత్మక మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. అంతేగాక, ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే జ్యుడీషియల్ కమిటీ ఆమోదించాలి.
Recommended Video
ఆ తర్వాత ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం కూడా పొందాలి. అనంతరం అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాలుస్తుంది. ఒక వేళ ఈ బిల్లు చట్టరూపం దాల్చితే అమెరికాకు చిన్నవయసులో వచ్చినవారు, తాత్కాలికంగా రక్షణ పొందినవారు, వ్యవసాయ కూలీలు, కరోనా వైరస్ కాలంలో అత్యవర కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేసినట్లేనని.. ఇమ్మిగ్రేషన్ పాలసీ అనలిస్ట్ తెలిపారు. భారత్, చైనా దేశీయులే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications