ట్రంప్ ఆరోగ్యంపై సంచలన ప్రకటన.. బరువు తగ్గుతున్నారు.. కానీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. జూన్ 14న ట్రంప్ 79వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు శ్వేతసౌధం వైద్యులు వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అందుకు సంబంధించిన రిపోర్టును బహిర్గతం చేశారు. అయితే ఈ వైద్య రిపోర్టు ప్రకారం డొనాల్డ్ ట్రంప్ బరువు తగ్గిపోతున్నారు. 2020లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షలతో పోలిస్తే ట్రంప్ ఈసారి 20 పౌండ్ల బరువు తగ్గినట్లు ఫలితాల్లో వెల్లడైంది. అప్పట్లో ట్రంప్ బరువు 244 పౌండ్లు.. కాగా తాజాగా 224 పౌండ్లకు తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
అంతేకాకా ట్రంప్ ఆరోగ్యం నిలకడగా లేదని.. కొంత ఆందోళనకరమైన పరిస్థితిలోనే ఉన్నట్లు సమాచారం. ఆయన చర్మానికి సంబంధించి అనారోగ్యంతో ఉన్నట్లు తేలింది. గతేడాది ఎన్నికల ప్రచారంలో తగిలిన బుల్లెట్ గాయం కారణంగా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని తెలిసినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం ట్రంప్ పూర్తి ఫిట్ నెస్ తోనే ఉన్నారని వైద్యుడు, నేవీ కెప్టెన్ సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా విధులు నిర్వహించేందుకు ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నారని తెలిపారు. ట్రంప్ చురుకైన జీవన శైలి వల్లనే ఈ వయసులోనూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారని సీన్ బార్బబెల్లా తెలిపారు.
-
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!










Click it and Unblock the Notifications