షాక్: పెళ్ళిని రద్దు చేసుకోండంటూ ప్రిన్స్ హ్యరీకి మేఘన్ సోదరుడి లేఖ

లండన్: ఓవైపు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ల వివాహానికి రాజకుటుంబీకులు ఏర్పాట్లు సాగిస్తున్నారు. అయితే ఈ పెళ్ళిని నిలిపివేయాలని ఓ లేఖ వచ్చింది. పెళ్ళి కూతురు సోదరుడే ఈ పెళ్ళిని నిలిపివేయాలని కోరుతూ లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది.

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీని హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ వివాహం చేసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది మే 19వ తేదిన వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది. ఈ వివాహం కోసం రాజ కుటుంబం ఏర్పాట్లు చేస్తుండగా ఈ వివాహన్ని నిలిపివేయాలని కోరుతూ మేఘన్ మార్కెల్ సవతి సోదరుడు థామస్ మార్కెల్ లేఖ రాశాడు.

పెళ్ళి కొడుకు ప్రిన్స్ హ్యరీకి మార్కెల్ సోదరుడు థామస్ లేఖ రాశాడు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదన్నారు. పెళ్ళి ఆపేస్తే మీ కుటుంబానికి మంచిందంటూ హ్యారీని థామస్ హెచ్చరించారు.

ఈ నెల 19న లండన్‌లోని విండ్సర్‌ క్యాజిల్‌లో జరగబోయే రాయల్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. కానీ ఈ నేపథ్యంలో మేఘన్ సోదరుడు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు.

Meghan Markles brother says it is not too late to call off the wedding in letter to Prince Harry

ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్‌ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదు.

ఒక వేళ ఆమెను మీ ఇంటి సభ్యురాలిగా చేసుకుంటే రాజకుటుంబం గౌరవ, మర్యాదలు మంటకలిసిపోతాయి. పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మా కుటుంబానికి మేఘన్ చాలా దూరంగా ఉంటోంది. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. ఆమె ఎప్పటికీ నాకు చెల్లెలే. రాజ కుటుంబానికి కోడలికి మేఘన్ మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ఆయన హ్యరీకి ఆ లేఖలో పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+