షాక్: మరోసారి ట్రంప్ చేయిని విసిరికొట్టిన మెలానీయా, ఏమైంది?

ప్రపంచదేశాలను తన కనుసన్నల్లో నడుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన భార్యను ప్రసన్నం చేసుకొనేందుకు మాత్రం నానా తంటాలు పడుతున్నాడు.

రోమ్: ప్రపంచదేశాలను తన కనుసన్నల్లో నడుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన భార్యను ప్రసన్నం చేసుకొనేందుకు మాత్రం నానా తంటాలు పడుతున్నాడు. సౌదీ పర్యటనలో మెలానీయా ట్రంప్ చేయిని విదిలికొట్టిన ఘటన మరువకముందే రోమ్ లో కూడ అదే తరహ ఘటన మరోటి చోటుచేసుకొంది. మెలానీయ కోపం తగ్గేందుకు చర్యలు తీసుకోకపోతే పబ్లిక్ గా ఈ రకమైన ఘటనలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తోందో.

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి విదేశీ పర్యటన మెలానీయ అసంతృప్తి పబ్లిక్ గా కన్పిస్తోంది. రియాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిని మెలానీయా విసిరికొట్టింది.ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా మీడియాల్లో ప్రసారమైంది. ఈ దృశ్యాలు ట్రంప్ పరువును గంగలో కలిపాయి.అయితే ఈ ఘటన మరువకముందే మరో ఘటన రోమ్ లోచోటుచేసుకొంది.

 Melania publicly snubs Donald Trump again

రోమ్ లో విమానం ల్యాండ్ కాగానే ఇద్దరూ బయటకు వచ్చి అభివాదం చేశారు. విమానం మెట్లు దిగుతుండగా ట్రంప్ మెలానియా చేతిని అందుకునేందకు ప్రయత్నించారు. అయితే ఆమె మాత్రం చేతికి పైకి తీసుకొని తలను సవరించుకొన్నట్టుగా దూరం జరిగింది.

దీంతో మరోసారి షాక్ కు గురైన ట్రంప్ నవ్వుతూ ఆమెను సముదాయించి తన తడబాటును కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నించారు. రియాద్ లో రెడ్ కార్పెట్ వెడల్పుగా లేదు కాబట్టి ట్రంప్ పక్కన కాకుండా వెనుక నడిచారని, ఉద్దేశ్యపూర్వకంగా ట్రంప్ చేతిని విసిరికొట్టేదని చాలామంది భావించారు.

అయితే ఈ సారి మాత్రం మెలానియా చేష్టలు స్పష్టంగా కన్పించాయి. దీంతో ట్విటర్లు తెగ రెచ్చిపోయారు. మెలానీయా ఇప్పటికే ట్రంప్ చేతిని అందుకోవడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తే ...ఈ దంపతుల మధ్య విభేదాలు ముదిరిపాకాన పడ్డాయంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+