మెల్బోర్న్‌లో కాల్పుల కలకలం: గన్‌మెన్ హతం
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పట్టణంలో కలకలం రేగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్‌లో కాల్పులు జరిగాయి. దీంతో అందరూ ఉలిక్కి పడ్డారు. దుండగులు నలభై రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పట్టణంలో కలకలం రేగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్‌లో కాల్పులు జరిగాయి. దీంతో అందరూ ఉలిక్కి పడ్డారు. దుండగుడు నలభై రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.
అపార్టుమెంటులో ఉన్న దుండగుడు అదుపులో ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అపార్ట్‌మెంట్ వద్ద పెద్ద మొత్తంలో అత్యవసర సేవల విభాగం అధికారులు మోహరించారు.

పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో దుండగుడు మృతి చెందాడు. పెద్ద మొత్తంలో పోలీసులు రావడంతో దాదాపు ఆ అపార్ట్‌మెంట్ ఉన్న కాలనీలోని షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారు.












Click it and Unblock the Notifications