174 ఏళ్లలో ఎన్నడూ చూడని భయంకర తుపాను.. 25 మంది మృతి..
హరికేన్ మెలిస్సా కరీబియన్ దీవులను అల్లకల్లోలం చేస్తుంది. ఈ భీకర తుపాను కారణంగా వరదలు సంభవించి హైతీ ద్వీపంలోని పెటిట్- గోవే ప్రాంతంలో 25 మంది మృతి చెందారు. తుపాను ధాటికి స్థానికంగా ఉన్న లా డిగూయ్ నది ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి. దీంతో వీళ్లంతా నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ తుపాను కరీబియన్ దేశాలైన జమైకా, క్యూబా లో విలయ తాండవం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ దేశాల్లోని వేలాదిమంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. ఇళ్లు నీట మునిగి.. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరీబియన్ దీవులపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపానుగా పేరుగాంచిన హరికేన్ మెలిస్సా విలయ తాండవం చేస్తోంది. గత 174 ఏళ్లలో ఎన్నడూ చూడని భీకర తుపాను ధాటికి కరీబియన్ దీవుల్లోని హైతీ, జమైకా, క్యూబా ద్వీపాలు అల్లకల్లోలం అవుతున్నాయి. తుపాను ధాటికి లా డిగూయ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆకస్మిక వరదలు సంభవించి హైతీ ద్వీపంలోని పెటిట్- గోవే ప్రాంతంలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక జమైకా, క్యూబాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుపాను ధాటికి ఈ ద్వీపాల్లోని ఇళ్లు మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా లేక దీవుల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లా డిగూయ్ నది ఉప్పొంగడంతో ఒక్కసారిగా వరదలు సంభవించినట్లు స్థానిక మేయర్ జీన్ బెట్రాండ్ తెలిపారు. ఇళ్లన్నీ వరదల్లో కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొంత మంది వరదల్లో చిక్కుకున్నారని వారిని రక్షిస్తున్నట్లు తెలిపారు. జమైకా లో దాదాపు 25 వేల మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. హరికేన్ మెలిస్సా గంటకు 295 కి. మీ. వేగంతో దూసుకొస్తున్నట్లు తెలిపారు.
🌪️ 📷 Imagens chocantes de Kingston, Jamaica, mostram os estragos do furacão Melissa, que avança pelo Caribe com força devastadora. 📷#Hurricanemelissa #Melissa #Jamaica pic.twitter.com/DwzYCPNKq3
— Leonardo Z Vieira (@mkidzv) October 28, 2025
జమైకా ద్వీపంలోని 77 శాతం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు జమైకా మంత్రి దానా మోరిస్ దిక్సోన్ తెలిపారు. ఇక క్యూబాలో ఇప్పటికే 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. హరికేన్ మెలిస్సా ప్రభావం ప్రధానంగా హైతీ, జమైకా, క్యూబా ద్వీపాలపై ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications