కరిగించిన కన్నీళ్లు.!ఏడ్చిన డెలివరీ బాయ్.!దోచుకుంది వెనక్కిచ్చి, హగ్గిచ్చి, ఓదార్చి వెళ్లిపోయిన దొంగ
కరాచి/హైదరాబాద్ : అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు గమ్మత్తుగా పరిణమించడంతో పాటు ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తుంటాయి. ఎదుటి వాళ్లు తలపెట్టే మంచికైనా, చెడుకైనా ఇలాంటి ఘటనలతో అవినాభావ సంబంధం ఎక్కువగా ఉంటుంది. ఐతే జరిగిన సంఘటన ఏదైనా కాస్త సహనం, ఓర్పు ఉంటే జరగబోయే పరిణామంలో ఎంతో వైవిద్యం చోటుచేసుకుంటుంది. ఊహించని అనుభవం కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే చేజారిపోయింది కూడా తిరిగి సొంతం అవుతుందనే పచ్చి నిజం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. కాయ కాష్టం చేసి కాలం వెళ్లదీస్తున్న ఓ డెలిరీ బాయ్ దోపిడీ వ్యవహారం ఇవే అంశాలను నిర్ధారిస్తున్నాయి.

కన్నీళ్లే కాపాడాయి. దోపిడీ దొంగల మనసు కరిగించిన డెలివరీ బాయ్ ఏడుపు..
జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. సర్వం కోల్పోయాం దేవుడా ఇప్పుడేంటి పరిస్దితి అనుకునే సమయంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో జీవనం కొపసాగించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, దోపిడీ దొంగతనాలు చేయడానికి కూడా అన్ని మార్గాలు కూడా ఉంటాయి. కాకపోతే ఒకడు కష్టపడి రాజమార్గంలో సంపాదించుకోవాలని అనుకుంటే మరోకడు దొంగదారుల్లో వేగంగా సంపాదించుకోవాలని కుయుక్తులు పన్నుతుంటాడు. సరిగ్గా ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్న వారి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన డెలివరీ బాయ్..
పాకిస్తాన్ దేశంలోని కరాచి నగరంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊరూ వాడా తిరికి వారు ఆన్ లైన్ లో ఆర్దర్ చేసుకున్న వస్తువులను వారికి అందించి ఎంతో కొంత సంపాదించుకునే డెలివరీ బాయ్ జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. యధావిధిగా విధి నిర్వహణలో భాగంగా డోర్ డెలివరీ చేసి వెరక్కి తిరిగి తన వాహనం వద్దకు వచ్చిన ఆ డెలివరీ బాయ్ ని ఇద్దరు దారి దోపిడి దొంగలు అటకాయించారు. అంతటితో ఆగకుండా డెలివరీ బాయ్ దగ్గరు ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. అనుకోకుండా జరిగిన పరిణామానికి డెలివరీ బాయ్ అవాక్కయ్యాడు. చేసేది ఏమీ లేక దొంగల ముందే బోరున ఏడ్చేసాడు.

ఎక్కెక్కి ఏడ్చిన డెలివరీ బాయ్.. దోచుకుంది వెనక్కిచ్చిన దొంగలు..
ఆ డెలివరీ బాయ్ కళ్ల నుండి వస్తున్న కన్నీళ్లు కరుడుగట్టిన ఆ దారిదోపిడీ దొంగల మనసును కరిగించాయి. డెలివరీ ఇచ్చి వెళ్లే సమయంలో అటుగా ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు దొంగలు డెలివరీ బాయ్ ని అటకాయించారు. దుండగులు డెలివరీ బాయ్ ని బెదిరించి అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులను లాక్కుని జేబులో పెట్టెకున్నారు. బక్క పలచగా ఉన్న డెలవరీ బాయ్ వచ్చిన ఆగంతకులను ఎదురించలేడు. ఎదురించాలంటే అతని దగ్ర ఏదైనా పదునైన ఆయుధం ఉండాలి. మన వాడి దగ్గర అదికూడా లేదు. దీంతో ఏం చేయాలో తెలియని డెలివరీ బాయ్ ఎక్కెక్కి కన్నీటి పర్యంతం అయిపోయాడు.

డెలివరీ బాయ్ ని ఓదార్చి, వాటేసుకున్న దొంగ.. కరాచీలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన..
ఇదిలా ఉండగా దొంగలకు కూడా మనసు ఉంటుందని, అది కన్నీళ్లకు కరుగుతుందని దోపిడీ చేసిన దొంగలు నిరూపించారు. డెలివరీ బాయ్ ఏడుపుతో మనసు మార్చుకున్న ఆ ఇద్దరు దొంగలు అతడి వస్తువులను తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు అందులో ఒకరు బైక్‌పైనే ఉండగా, కిందికి దిగిన మరో వ్యక్తి డెలివరీ బాయ్‌ని హత్తుకొని ఓదార్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఆ ముగ్గురు వెళ్లిపోయారు. పాకిస్థాన్ రాజధాని కరాచీలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్ ఏడుపు, దొంగల వ్యవహారం, వారి మద్య జరిగిన సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా మారింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications