ఫేస్ బుక్ పేరు మార్పు-ఈ నెల 28న జుకర్ బర్గ్ ప్రకటించే ఛాన్స్ - సోషల్ మీడియాలో మీమ్స్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పేరు మారబోతోంది. ఫేస్‌బుక్ తన పేరును మార్చుకోవాలని భావిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన హోరు పెరుగుతోంది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అక్టోబర్ 28 న జరిగే కంపెనీ వార్షిక కనెక్ట్ కాన్ఫరెన్స్‌లో పేరు మార్పు గురించి ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో దీనిపై చర్చ సాగుతోంది.
ఫేస్ బుక్ పేరు మార్పుపై లీకులు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ట్విట్టర్ తో పాటు మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. పలువురు కొత్త పేర్లను ఫేస్ బుక్ కు సూచిస్తున్నారు. మరికొందరు దీనికి సంబంధిచి ఊహాత్మక గేమ్స్ ను సైతం షేర్ చేస్తున్నారు. ట్విట్టర్ లో నెటిజన్లు రీబ్రాండెడ్ ఫేస్‌బుక్ కు కొత్త పేర్లు సూచిస్తున్నారు. అయితే ఓ టెక్ సంస్ధ వ్యవస్ధాపకుడు ఫేస్ బుక్ కు తప్పు పేర్లను ఇవ్వాలని కోరగా.. ఇందుకు స్పందించి పలు పేర్లు షేర్ చేస్తున్నారు. దీంతో యెల్లో పేజెస్, జుక్ వంటి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఈ నెల 28న జరిగే వార్షిక కంపెనీ సమావేశంలో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ పేరు మార్పుపై కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఫేస్ బుక్ కు జుకర్ బర్గ్ ప్రకటిస్తారని భావిస్తున్న పేర్లతో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఫేస్ బుక్ పేరు మార్పుపై పలు గేమ్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫేస్ బుక్ కొత్త పేరుపై అభిమానుల్లో, యూజర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త పేరు ఎలా ఉండబోతుందన్న దానిపై ఇప్పటికే యూజర్లలోనూ ఊహాగానాలు పెరుగుతున్నాయి.
What should Facebook’s new name be?
— Yano (@JasonYanowitz) October 20, 2021
Wrong answers only. pic.twitter.com/n34WB6kRqM












Click it and Unblock the Notifications