నిషిద్ధ టివి ప్రోగ్రాం,వ్యభిచారం: 80మందికి బహిరంగ ఉరి

వివరాల మేరకు.. దక్షిణ కొరియాకు చెందిన టెలివిజన్ షోలను అక్రమంగా చూస్తున్నారన్న కారణంతో ఉత్తర కొరియా ఈ నెల ప్రారంభంలో దాదాపు 80 మందికి బహిరంగంగా మరణశిక్షను అమలు చేసింది. అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ దక్షిణ కొరియాకు చెందిన ఒక వార్తా పత్రిక సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన వదంతులను తామూ విన్నామని, దక్షిణ కొరియా వార్తా పత్రిక తొలి పేజీలో ప్రముఖంగా ప్రచురితమైన ఈ వార్తకు విశ్వసనీయత ఉందని ఉత్తర కొరియాకు చెందిన ఒక ఫిరాయింపు గ్రూపు పేర్కొంది.
ఉత్తర కొరియా నుంచి ఈ గ్రూపు ఇటీవలే దక్షిణ కొరియాకు ఫిరాయించింది. ఉత్తర కొరియాలోని ఏడు నగరాల్లో ఈ నెల మూడో తేదీన ఈ మరణ శిక్షలను అమలు చేసినట్టు ఈ గ్రూపుతో పాటు ఆ దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలతో సన్నిహిత సంబంధాలున్న వర్గాలు వెల్లడించాయని ఆ పత్రిక పేర్కొంది.












Click it and Unblock the Notifications