వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛాయ్ చమక్కులే చూడరా భాయ్: రెండు కప్పుల ఛాయ్‌తో తండ్రి అవుతారట..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీ తాగడం వల్ల కలిగే లాభం

సామాన్యంగా పదే పదే టీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది చెబుతుంటారు. కానీ ఛాయ్ పడందే మన దినచర్య మొదలు కాదు. అంతెందుకు చెప్పేవాళ్లే ఛాయ్‌లు యమ లాగించేస్తారు. టీ తాగడం వల్ల ఎక్కువగా ఆకలి అవ్వదని మరికొందరు చెప్తూ ఉంటారు. కానీ బిరియాని తింటానే టీ తాగే వాళ్లు చాలామందే ఉంటారు. ఈ టీలో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీలే ఉన్నాయి. ఇక టీ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్న వారే ఇప్పుడు పరిశోధనలు చేసి కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

 టీ తాగటం వల్ల ఉపయోగాలు

టీ తాగటం వల్ల ఉపయోగాలు

ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమ్ముక్కులే చూడరా భాయ్...అంటూ ఓ సినీగీతానికి మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులేస్తారు. అంతేకాదు టీ యొక్క గొప్పతనాన్ని అందులో వివరిస్తారు. ఈ పాట వింటే చాలు వెంటనే టీ తాగితే ఇన్ని లాభాలు ఉంటాయా అని అనిపించక మానదు. వెంటనే ఓ కప్ వేడి వేడి ఛాయ్ తాగాలనిపిస్తుంది. అయితే ఒకప్పుడు టీ తాగటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్న వారు నేడు టీ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.

రోజుకు రెండు కప్పుల టీ తాగితే గర్భం దాలుస్తారట

రోజుకు రెండు కప్పుల టీ తాగితే గర్భం దాలుస్తారట

ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్యసమస్యల్లో ఒకటి దంపతులకు పిల్లలు కలగకపోవడం. ఇందుకు కారణం విపరీతమైన పని ఒత్తిడితో, మారుతున్న జీవన ప్రమాణాలతో పురుషుడి వీర్యంలో నాణ్యత లోపిస్తోంది. ఇది పిల్లలు పుట్టకపోవడానికి కారణం అవుతోంది. ఇలా తండ్రులు కావాలనుకునే పురుషులు రోజుకు రెండు కప్పుల టీ తాగితే చాలట త్వరగా తండ్రి అవుతారని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇలా టీ తాగడం వల్ల తమ భార్యలను త్వరగా గర్భవతులను చేయొచ్చని పరిశోధన వెల్లడించింది.

 పురుషుడి వీర్యంపై కెఫైన్ ప్రభావం

పురుషుడి వీర్యంపై కెఫైన్ ప్రభావం

రోజుకు రెండు కప్పుల టీ తాగడం వల్ల అందులో ఉన్న కెఫైన్ ఏటీపీ మరియు జీటీపీలపై ప్రభావం చూపుతుందట. దీంతో వీర్యం మరింత శక్తి పుంజుకుని త్వరగా స్త్రీ యొక్క అండంతో కలిసే క్రమంలో వేగం పుంజుకుంటుందని పరిశోధకులు వెల్లడించారు. పిల్లలు కలగకపోవడానికి పురుషుల్లోనే లోపం ఉంటే రోజుకు రెండు కప్పుల టీ తాగితే చాలు... భార్య గర్భం దాల్చడం ఖాయం.. పిల్లలు ఇంట్లో తిరగడం ఖాయమని జోస్యం చెబుతున్నారు పరిశోధకులు. మరోవైపు మహిళలు రెండ్రోజులకోసారి మద్యం సేవిస్తే వారు గర్భం దాల్చే శాతం పడిపోతుందని ఇదే పరిశోధనలో వెల్లడైంది. మద్యం సేవిస్తున్న మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు 26శాతం తక్కువగా ఉన్నట్లు స్టడీ పేర్కొంది.

English summary
Tea is the preferred beverage for a number of people as many even claim that it has health benefits. Fertility is a major concern in a world with drastic changes in lifestyle causing stress and affecting sperm quality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X