'మెటా': ఫేస్‌బుక్ కంపెనీకి కొత్త కార్పొరేట్ పేరు.. ఫేస్‌బుక్ యాప్ పేరులో మార్పు లేదు

రీ బ్రాండింగ్‌లో భాగంగా ఫేస్‌బుక్ తన కార్పొరేట్ పేరును 'మెటా'గా మార్చింది.
సోషల్ మీడియాతోపాటూ వర్చువల్ రియాలిటీ వంటి రంగాల్లో కూడా తన పరిధిని విస్తరిస్తున్నందున, తాము నిర్వహించే అన్ని పనులను సూచించే పేరు ఉండటం మంచిదని కంపెనీ తెలిపింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వ్యక్తిగత ప్లాట్‌ఫాంలకు ఈ మార్పు వర్తించదు. కేవలం మాతృ సంస్థకు మాత్రమే వర్తిస్తుంది.
ఒక మాజీ ఉద్యోగి లీక్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా ఫేస్‌బుక్‌పై నెగటివ్ కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన తర్వాత కంపెనీ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.
కంపెనీ "భద్రత కంటే లాభాలకు" అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఫ్రాన్సెస్ హౌగెన్ ఆరోపించారు.
2015లో గూగుల్ తన కంపెనీ మాతృ సంస్థ పేరును 'ఆల్ఫాబెట్'గా మార్పు చేసింది. అయితే ఆ పేరుకి అంతగా గుర్తింపు లభించలేదు.
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ "మెటావర్స్"ను రూపొందించే ప్రణాళికలను ఆవిష్కరించినప్పుడు ఈ కొత్త పేరును ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లతో గేమ్స్ ఆడటం, పని చేసుకోవడం, ఒకరితో మరొకరు కమ్యునికేట్ చేసుకునే ఆన్‌లైన్ ప్రపంచం.
ప్రస్తుతం ఉన్న బ్రాండ్ "బహుశా ఈ రోజు మనం చేస్తున్న ప్రతి పనికి భవిష్యత్తులో ప్రాతినిధ్యం వహించలేదు" అందుకే పేరు మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
"కాలక్రమేణా, మమ్మల్ని ఒక మెటావర్స్ కంపెనీగా చూస్తారని నేను ఆశిస్తున్నాను" అని జుకర్ బర్గ్ ఓ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
"మేం ఇప్పుడు మా వ్యాపారాన్ని రెండు వేర్వేరు విభాగాలుగా చూస్తున్నాం. ఒకటి ప్రస్తుత మా సొంత యాప్‌ల కోసం, మరొకటి భవిష్యత్ ప్లాట్‌ఫాంలలో చేయబోయే మా పని కోసం.’’
"దీనిలో భాగంగానే, మనం చేసే ప్రతి పనిని సూచించేలా కంపెనీ కొత్త బ్రాండ్ పేరు మార్చడానికి ఇది సరైన సమయం" అని జుకర్‌బర్గ్ అన్నారు.
కంపెనీ గురువారం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో బ్లూ ఇన్ఫినిటీ ఆకారంలో ఉన్న కొత్త లోగోను కూడా ఆవిష్కరించింది.
కొత్త పేరు కాలక్రమేణా అందరికీ తెలుస్తుంది. కంపెనీ ఇతర సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు ఫేస్‌బుక్‌ను వాడాల్సిన అవసరం లేదని జుకర్‌బర్గ్ అన్నారు.
"మెటా" అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అర్థం "అంతకుమించి".
మెటావర్స్ ఓ వర్చువల్ రియాలిటీ వెర్షన్ లాగా కనిపించవచ్చు. కానీ కొంతమంది అది ఇంటర్నెట్ ప్రపంచానికి భవిష్యత్తుగా భావిస్తారు.
కంప్యూటర్‌ని వినియోగించడానికి బదులుగా, మెటావర్స్‌లోని వ్యక్తులు హెడ్‌సెట్‌ను ఉపయోగించి అన్ని రకాల డిజిటల్ ఎన్విరాన్‌మెంట్‌లను కనెక్ట్ చేసే వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- 'జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అడిగిందల్లా చేశా.. సంబంధం లేదు అంటే బాధేసింది’ - వైఎస్ షర్మిల
- వైఎస్ షర్మిల: నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగండి -News Reel
- త్రిపురలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- డికాక్: 'మోకాళ్లపై నిలబడనందుకు క్షమాపణలు.. నేను జాత్యాహంకారిని కాదు’
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications