జైల్లో నుండి మైలు సొరంగం: డ్రగ్స్ రారాజు ఎస్కేప్
మెక్సికో: భారీ బందోబస్తు ఉన్న జైలు నుండి మాఫియా డాన్ తప్పించుకుని పారిపోయి అధికారులకు చుక్కలు చూపించాడు. జైల్లో నుండి ఒక మైలు పెద్ద సొరంగం ఏర్పాటు చేసి మరి తప్పించుకోవడంతో జైలు సిబ్బందిపై వేటు పడింది.
మెక్సికో నగరంలో సినిమా ఫక్కిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాఫియా డాన్ జాయ్ క్విన్ ఇ చాపో గుజ్ మెన్ ను మెక్సికో పోలీసులు అరెస్టు చేశారు. అతనిని మెక్సికో సెంట్రల్ జైలులోని ప్రత్యేక సెల్ లో పెట్టారు.
ఈ మెక్సికో జైలుకు కట్టుదిట్టమైన భద్రత ఉంది. అయితే జాయ్ క్విన్ గుట్టు చప్పుడు కాకుండా 1.5 కిలో మీటర్లు (ఒక మైలు) పొడవు సొరంగం తవ్వాడు. మూడు అడుగుల ఎత్తులో సొరంగం నిర్మించాడు. చివరికి జైలు సిబ్బంది కళ్లు గప్పి పరారైనాడు.

విషయం గుర్తించిన జైలు అధికారులు షాక్ కు గురైనారు. 30 మంది జైలు సిబ్బంది, అధికారులను విచారణ చేస్తున్నారు. జైలు నుండి సొరంగం పెట్టిన జాయ్ క్విన్ నిర్మాణంలో ఉన్న కట్టడంలో నుండి బయటకు వచ్చి పరారైనాడని జైలు శాఖ అధికారులు అంటున్నారు.
మెక్సికో నగరం చుట్టు పక్కల 55 కిలో మీటర్ల వరకు నాకాబంధి కొనసాగిస్తున్నారు. జాయ్ క్విన్ ను కచ్చితంగా పట్టుకుంటామని అధికారులు అంటున్నారు. మెక్సికోలో డ్రగ్స్ రారాజుగా జాయ్ క్విన్ పేరు సంపాదించాడు. సొరంగం పెట్టడానికి సహకరించిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సోరంగం పెట్టడానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications