కారు నడుపుతూ మోడీని రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన మెక్సికో అధ్యక్షుడు
మెక్సికో : దేశాధినేతలకు ఆతిథ్య దేశాలు సమున్నత గౌరవం ఇవ్వడం మామూలే. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళారంటే అన్నీ అరుదైన మధుర క్షణాలనే ఆస్వాదిస్తున్నారు. ఆయా దేశాధినేతలతో కలుపుగోలుగా మాట్లాడుతూ భారతదేశం గొప్పదనాన్ని వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
పనిలోపనిగా భారతదేశానికి రావాల్సినవి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇతరుల మనసును ఎంతగా దోచుకుంటున్నారో తెలియాలంటే మెక్సికోలో జరిగిన పరిణామాలను చూస్తే అర్థమైపోతుంది. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోడీ బుధవారం రాత్రి మెక్సికో వెళ్ళారు.
In a very special gesture,President @EPN personally drives @narendramodi to a restaurant for Mexican vegetarian fare pic.twitter.com/fF4WWQvUy2
— Vikas Swarup (@MEAIndia) June 9, 2016
మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత భోజనం కోసం మెక్సికో సిటీలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. అప్పుడు కూడా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మెక్సికో అధ్యక్షుడే స్వయంగా కారు నడుపుతూ మోడీని రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు.
ఆ రెస్టారెంటులో ఇద్దరూ శాకాహార భోజనం చేశారు. బీన్ టకోస్ తింటూ సాదరంగా ముచ్చటించుకున్నారు. అత్యంత అరుదైన ఈ చిత్రాలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications