గోడ కట్టుకోవచ్చు: ట్రంప్‌కు మెక్సికో అధ్యక్షుడి కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైతే, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టిస్తానని రిపబ్లికన్ల పార్టీ తరఫువ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మెక్సికో అధ్యక్షులు పెనా నీటో ధీటుగా స్పందించారు.

రెండు దేశాల సరిహద్దుల్లో గోడ కట్టాలని భావిస్తే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చని చెప్పారు. అది అమెరికా ప్రభుత్వం అంతర్గత విషయమన్నారు. దాని వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. మెక్సికన్లు వలసదారులని, రేపిస్టులని, డ్రగ్ డీలర్లని ట్రంప్ చేసిన ఆరోపణలనూ నీటో ఖండించారు.

Mexico tells Donald Trump if he wants a wall, he can build it

హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల మనస్తత్వం డొనాల్డ్ ట్రంప్‌కు ఉందన్నారు. భద్రత, వాణిజ్యం తదితర అంశాల్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మాత్రమే తాము ఉంటామని చెప్పారు.

కాగా, గతంలో ట్రంప్‌ ప్రచారంలో భాగంగా మెక్సికన్లు అక్రమంగా అమెరికాలోకి వస్తున్నారని విమర్శించారు. మెక్సికన్‌ వలసదారులను రేపిస్ట్‌లు, క్రిమినల్స్‌, డ్రగ్‌ డీలర్స్‌ అంటూ తీవ్రంగా అవమానపరిచారు. దీంతో మెక్సికో అధ్యక్షుడు పెనా నీటో కూడా ఘాటుగా స్పందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mexico's president hit back at Republican presidential candidate Donald Trump's claim that if elected, he would make Mexico build a wall along its US border.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి