Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను మైకేల్ జాక్సన్ అనేకమార్లు రేప్ చేశాడు: జేమ్స్

న్యూయార్క్: దివంగత ప్రముఖ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్‌ తనపై సుమారు నాలుగేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేశాడు అతడి సహ నటుడు జేమ్స్ సేఫ్‌ఛక్(36). జీవించి ఉన్నప్పుడే పలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న మైకేల్ జాక్సన్‌పై చనిపోయి ఐదు సంవత్సరాలైన తర్వాత కూడా ఆరోపణలు రావడం గమనార్హం. ప్రస్తుతం వచ్చిన తాజా ఆరోపణలు హాలీవుడ్ సంచలనంగా మారాయి.

1980లో మైకేల్ జాక్సన్‌తో కలిసి పెప్సీ వాణిజ్య ప్రకటనలో జేమ్స్ నటించాడు. అప్పుడు తనకు పదేళ్లుంటాయని, ఆ సమయంలోనే అనేకమార్లు మైకేల్ జాక్సన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జేమ్స్ ఆరోపించాడు. సెక్స్ కోసం మైకేల్ జాక్సన్ సీక్రెట్ కోడ్స్ వాడేవాడని చెప్పాడు. జేమ్స్ కోర్టుకు దాఖలు చేసిన పిర్యాదులో తీవ్ర ఆరోపణలు ఉన్నాయని అతని తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కథనాన్ని అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ ప్రచురితం చేసింది.

Michael Jackson hit with new child sex abuse claims

జేమ్స్‌ను అనేకసార్లు అనుభవించిన మైకేల్ జాక్సన్.. అతడ్ని వివాహం చేసుకునేందుకు ఉంగరాన్ని, మ్యారేజ్ సర్టిఫికేట్‌ను కూడా సిద్ధం చేసుకున్నట్లు జేమ్స్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మైకేల్ జాక్సన్ చనిపోయిన ఐదేళ్ల తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, తనపై అత్యాచారానికి పాల్పడ్డ నేరానికి పరిహారంగా మైకేల్ జాక్సన్ ఎస్టేట్స్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టుకు జేమ్స్ విజ్ఞప్తి చేశారు. జేమ్స్ చేస్తున్న ఆరోపణలను కోర్టు తిరస్కరిస్తుందని జాక్సన్ ఎస్టేన్ న్యాయవాది విట్జ్ మెన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ 4వ తేదీన ఈ కేసు విచారణకు రానుంది. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకున్న కారణంగా 2009, జూన్‌లో మైకేల్ జాక్సన్ మరణించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+