'నా భర్తను వదలండి': పిల్లాడని ఎత్తుకొని, ముద్దిచ్చిన భామకు షాక్

లండన్: అల్టిమో లింగరీస్ చైన్ ఓనర్, ఇన్నర్‌వేర్ బిజినెస్ టైకూన్ మిచెల్లీ మూన్ (44)ను రెండున్నర అడుగుల వ్యక్తి ఒకతను ఖంగు తినిపించాడు. ఆమె 3వేల మంది ఎదుట ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకుంది. కానీ అతను 46 ఏళ్ల పెళ్లైన వ్యక్తి అని తెలిపింది. దీంతో ఆమె షాకైంది.

బ్రాలు వంటి ఇన్నర్ వేర్ బిజినెస్‌మ్యాన్ అయిన మిచెల్లీ మూన్ తన వ్యాపార విస్తరణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు పర్యటిస్తుంటారు. అందులో భాగంగా శనివారం వియత్నాం వెళ్లింది.

అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదిక పైనుంచి ఆమె ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ మూడు వేల మంది ప్రతినిధులు ఉన్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు వేదిక పైకి ఓ బుడతడు వచ్చాడు. ఓ ఫ్లవర్ బొకేను తీసుకు వెళ్లి ఆమె చేతిలో పెట్టాడు.

 Michelle Mone picked up child in Vietnam before realising he was a married man

ఆ చిన్నవాడు తనకు ఫ్లవర్ బొకే ఇవ్వడంతో ఉబ్బితబ్బిబైన మిచెల్లీ మూన్ అతనిని ఎత్తుకొని ముద్దాడింది. ఓ సెల్ఫీ తీసుకుంది.

అంతలోనే.. 'దయచేసి నా భర్తను కిందకు దింపండి' అని ఓ మహిళ అభ్యర్థించింది. దీంతో విస్తుపోవడం మిచెల్లీ మూన్ వంతయింది.

అసలు విషయమేమంటే.. ఆ బుడ్డోడు చిన్నపిల్లాడేం కాదు. అతని వయస్సు 46 ఏల్లు. అయితే పొట్టిగా ఉన్నాడు. అతనికి పెళ్లైంది. పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి, షాక్ నుంచి తేరుకున్న మిచెల్లీ మూన్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+