భర్తను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించిన మిషెల్లీ ఒబామా
వాషింగ్టన్: ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్... మిషెల్లీ ఒబామా తన భర్త అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఇమిటేట్ చేస్తూ చెప్పిన మాటలు నవ్వులు పూయించారు. ఎనిమిదేళ్లు అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించిన ఒబామా త్వరలో ఈ పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బర్ట్ నిర్వహించే 'ద లేట్ షో' లో ఫ్లోటస్ మిషెల్లీ పాల్గొంది. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో కుటుంబమంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో మిషెల్లీ ఈ సందర్భంగా వివరించింది.
డిన్నర్ చేస్తున్న సమయంలో తన పెద్ద కూతురు మలియా గ్లోబల్ వార్మింగ్ వంటి సీరియస్ ప్రశ్నలను తన తండ్రిని అడుగుతూ ఉంటుందని, ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో ఒబామా ఎలా సమాధానమిస్తాడో ఇమిటేట్ చేసి మరీ చూపించింది.

'వెల్, ఈ ప్రశ్న అడగడం సంతోషంగా ఉంది. మూడు పాయింట్లతో సమాధానం వివరిస్తాను. పాయింట్1, పాయింట్ 1ఏ, పాయింట్ 1ఏబీ అంటూ' ఒబామా వివరిస్తూ చెబుతారని అనగానే ఈ షోకు హాజరైన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకోవడంతో పాటు చప్పట్లు కొట్టి అభినందించారు.
ఇక తాను, తన చిన్న కూతురు సాషా మాత్రం ఇష్టమైన పాటల గురించి మాట్లాడుకుంటామని మిషెల్లీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని బుధవారం సాయంత్రం వీడియో షేరింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పెట్టగా ఇప్పటికే పద్నాలుగు లక్షలకుపైగా ఈ వీడియోను చూశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications