దయా దాక్షిణ్యాలు లేవ్: లేఆఫ్స్ వేళ.. సత్య నాదెళ్ల సంచలనం

Microsoft: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే 9,000 మందిని లేఆఫ్ కింద తొలగించింది. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ను కఠినతరం చేసింది. 'రిటర్న్ టు ఆఫీస్' (RTO) పాలసీని అమలు చేస్తోంది. దీంతో పాటు టఫ్ అటెండెన్స్ పాలసీని కూడా ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి ఇదివరకే ఉద్యోగులందరికీ కూడా ఇంటర్నల్ ఇమెయిల్స్ పంపించింది.

ఈ పరిణామాలన్నింటిపై తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఉద్యోగులకు ఓ ప్రకటన చేశారు. ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఆఫీస్ అండ్ ఎంప్లాయ్ మధ్య ఏర్పడిన గ్యాప్ తొలగిపోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఉద్యోగులకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

Microsoft CEO Satya Nadella Addresses Employee Concerns Amid Layoffs and Return to Office

సీఎన్‌బీసీ, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో ఓపెన్ ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కంపెనీ విధి విధానాలు, పనితీరులో ఉద్యోగుల పట్ల కనీస సానుభూతి లోపించిందని అడిగిన ప్రశ్నకు సత్య నాదెళ్ల ఆచితూచి బదులిచ్చారు. ఈ ప్రశ్న, దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకున్నానని, అందుకు అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్న తనకు మాత్రమే పరిమితం అయ్యేది కాదని, తన టీమ్ లో పని చేస్తోన్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుందని అన్నారు. దీన్ని ఓ ఒపీనియన్ గా తీసుకుంటానని వ్యాఖ్యానించారు.

రిటర్న్ టు ఆఫీస్, టఫ్ అటెండెన్స్ పాలసీ మీద ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తోన్నాయని మైక్రోసాఫ్ హెచ్ఆర్ చీఫ్ అమీ కోల్‌మెన్ అంగీకరించారు. తాము స్వేచ్ఛను కోల్పోతామని కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, తనకు మెయిల్స్ పెట్టారనీ అన్నారు. సియాటెల్ చుట్టుపక్కల ఉండే ఉద్యోగులు ఇప్పటికే వారానికి సగటున రెండున్నర రోజులు ఆఫీసుల్లోనే గడుపుతున్నారని వివరించారు.

రిమోట్ వర్క్ వల్ల కొత్త ఉద్యోగులు, ఇంటర్న్‌ షిప్ చేసే వారు ఇబ్బందులు పడుతున్నారని సత్య నాదెళ్ల చెప్పారు. ఇంటర్న్ షిప్ చేసేవాళ్లు, కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకు సీనియర్ల సూచనలు, గైడెన్స్ సకాలంలో అందట్లేదని, ఫలితంగా వాళ్లు కొంత గందరగోళానికి గురి అవుతున్నారని చెప్పారు. వాళ్లందరూ వేర్వేరు ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో వర్క్ చేస్తోండటం వల్ల ఈ గ్యాప్ ఏర్పడిందని పేర్కొన్నారు.

దీర్ఘకాలిక సవాళ్లను కూడా ఉద్యోగులు మున్ముందు ఎదుర్కొనాల్సి రావొచ్చని సత్య నాదెళ్ల హెచ్చరించారు. ఇప్పుడు మనం అనుభవిస్తోన్న సౌకర్యాలు, స్వేచ్ఛ వల్ల కలిగే ప్రయోెజనాలు రేపు ఉండకపోవచ్చు.. అని తేల్చి చెప్పారు. ఇవన్నీ కోల్పోకముందే జాగ్రత్తపడక తప్పదని వ్యాఖ్యానించారు. మన ముందు చాలా కఠినమైన సవాళ్లు ఉన్నాయని, కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే ఈ క్లిష్ట ప్రక్రియను అధిగమించవచ్చని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+