వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ పాల్ అలెన్ కన్నుమూత: మిత్రుడు ఇకలేడంటూ బిల్‌గేట్స్ ఉద్వేగం

|
Google Oneindia TeluguNews

Recommended Video

మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ కన్నుమూత...!

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధి హడ్కిన్స్ లింఫోమాతో బాధపడుతున్న ఆయన.. సియాటెల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ విషయాన్ని ఆయన సొంత సంస్థ వుల్కాన్ ఐఎన్సీ పేర్కొంది. కాగా, పర్యావరణం, స్పేస్ ట్రావెల్, కళలు, క్రీడారంగాలకు పాల్ అలెన్ తన ఆస్తిలో ఎంతో భాగాన్ని ఉదారంగా దానమిచ్చారు.

Microsoft co-founder Paul Allen dies of cancer at age 65

బిల్ గేట్స్‌తో కలసి మైక్రోసాఫ్ట్‌ను పాల్ అలెన్ స్థాపించిన విషయం తెలిసిందే. పాల్ మృతి తన గుండెను పిండేస్తోందని బిల్ గేట్స్ ఓ ప్రకటనలో తెలిపారు. తనకున్న చిరకాల, ఆప్త మిత్రుల్లో పాల్ ఒకడని, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు కూడా పాల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

పాల్ లేకుండా పర్సనల్ కంప్యూటింగ్ అన్న మాటే ఉత్పన్నమయ్యేది కాదని చెప్పారు. పాల్ మృతిపట్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన్నుంచి తామంతో నేర్చుకున్నానని చెప్పారు.

English summary
Microsoft Co-Founder Paul Allen died from complications of non-Hodgkin's lymphoma on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X