టెక్కీలకు షాక్: మైక్రోసాఫ్ట్‌లో 3వేల ఉద్యోగాల కోత
న్యూయార్క్: ఇప్పటికే ప్రకటించన విధంగానే క్లౌడ్ బిజినెస్‌లపై దృష్టిపెట్టిన టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. మెరుగైన సేవల కోసం ఉద్యోగాల కోత తప్పడం లేదని స్పష్టం చేసింది.

ప్రభావం భారత్ ఉంటుందా?
అమెరికా వెలుపల ఉన్న వ్యాపారాల సేల్స్ స్టాఫ్‌ను కనీసం 3000వేల మందిని తీసివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ ఉద్యోగాల కోత మొత్తం ఆ కంపెనీకి ఉన్న సేల్స్ ఫోర్స్‌లో 10శాతం కంటే తక్కువేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రభావం భారత్‌పై ఉంటుందా? ఉండదా? అనే విషయంపై స్పష్టత రాలేదు.

మెరుగైన సేవల కోసమే..
తమ కస్టమర్లు, పార్ట్‌నర్లకు మెరుగైన సేవలు అందించడం కోసమే కంపెనీలో ఈ మార్పులు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘అన్ని సంస్థల్లో జరిగినట్లే ప్రతి ఏడాది మా సంస్థలోనూ మదింపు ఉంటుంది. అందులో భాంగా కొన్ని శాఖల్లో ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. అందుకే మరికొన్నింట్లో భారం తగ్గించుకోవాల్సి ఉంటుంది' అని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.

అమెరికా బయట ఉన్నవాళ్లే..
కోల్పోనున్న ఉద్యోగుల్లో 75 శాతం అమెరికా బయట ఉన్నవాళ్లేనని తెలిపారు. మైక్రోసాఫ్ట్ తమ క్లౌడ్ సర్వీసెస్ ప్రొడక్ట్ అయిన అజ్యూర్‌ను ఎలా ప్రమోట్ చేయాలన్నదానిపైనే దృష్టి సారిస్తున్నదని, ఇందులో అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్‌కు గట్టి పోటీ ఉందని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు.

అమేజాన్ మించిపోయింది..
సర్వర్ ప్రొడక్ట్ లతో సర్వీసుల ఆదాయం 15శాతంపైకి పెరిగాయి. అంతేగాక, చివరి త్రైమాసికంలో అంతకుముందుతో పోలిస్లే అజ్యూర్ 93 శాతం వృద్ధి సాధించింది. ఈ వ్యాపారాలు అమేజాన్ వెబ్ సర్వీసులను సైతం మించిపోయి.. క్లౌడ్ మార్కెట్‌లో రెవెన్యూ లీడర్‌గా నిలిచాయి. మైక్రోసాఫ్ట్ అమెరికాలో 71 వేల మంది, ప్రపంచవ్యాప్తంగా లక్షా 21 వేల మంది పని చేస్తున్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ గత సంవత్సరం జులైలో 2,850మంది ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications