Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ పై ఉరుము లేని పిడుగు- ఆ నిర్ణయంతో కుదేల్

Microsoft Pakistan: టెక్ జెయింట్.. మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకుంది. ఆ దేశంలో గల తన కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. కార్యకలాపాలను నిలిపివేసింది. పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ పూర్తిగా వైదొలగింది. ఇది- పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేల్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వైదొలగినట్లు సియాటెల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి గల కారణాలపై తన అంచనాలను వెల్లడించింది. పాకిస్తాన్ లో ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ స్వేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించగలమనే విశ్వాసం విదేశీ పెట్టుబడిదారుల్లో సన్నగిల్లిందని పేర్కొంది.

Microsoft has shut down all operations in Pakistan

2000లో తొలిసారిగా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టింది మైక్రోసాఫ్ట్. లాహోర్, కరాచీ వంటి నగరాల్లో తన కార్యాలయాలను నెలకొల్పింది. సాఫ్ట్ వేర్ ఎగుమతులకు ఒక ఊపు తీసుకొచ్చింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడంలో కీలకంగా వ్యవహరించగలిగింది. స్థానికులకు ఉద్యోగులనూ కల్పించగలిగింది.

పాకిస్తాన్ లో నెలకొన్న అనిశ్చిత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడి వినియోగదారుల కొనుగోలు శక్తి సైతం భారీగా తగ్గింది. ముఖ్యంగా తక్కువ ధరల్లో లభించే ఉత్పత్తులపై వినియోగదారులు దృష్టి సారించారు. ఓ మోస్తరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి పాకిస్తానీయులెవరూ ముందుకు రావట్లేదు. ఫలితంగా తన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.

Microsoft has shut down all operations in Pakistan

దేశంలో సాఫ్ట్‌ వేర్ ఉత్పత్తులకు రోజురోజుకూ డిమాండ్ పడిపోతూ వస్తోండటం, ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా నమోదవుతోండటం, కార్యాలయాలు, పెట్టుబడులు మరింత విస్తరించుకోవడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడం వంటి కారణాలతో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం.. పాకిస్తాన్ టెక్ రంగానికి ఎదురుదెబ్బగా భావిస్తోన్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు రోడ్ల మీద పడినట్టయింది. డిజిటల్ రంగంపై దీని ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. టెక్ ఎకోసిస్టమ్ మొత్తంపై దీని ప్రభావం ఉంటుందని, ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+