డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక, భయంలేని సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు కలవరం లేదా భయం కలిగించడం లేదట.
వాషింగ్టన్: టెక్ కంపెనీలకు అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా వారికి ఉద్యోగాలు ఇవ్వకుంటే బాగుండదని ట్రంప్ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు కలవరం లేదా భయం కలిగించడం లేదట.
దానికి కూడా కారణం ఉందట. జాబ్ క్రియేటర్‌గా మైక్రోసాఫ్ట్ ఎక్కువ అవకాశాలు అమెరికన్లకే ఇచ్చిందంటున్నారు. ఈ విషయమై ఆయన చాలా విశ్వసనీయంగా ఉన్నారని అంటున్నారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

తమ ప్రధానమైన ఉపాధి అవకాశాలు ఎక్కువగా అమెరికాలో ఉన్నాయని డిజిటల్ లైఫ్ డిజైన్ టెక్ కాన్ఫరెన్సు సందర్భంగా సత్య నాదెళ్ల చెప్పారు. అమెరికాలో ఎక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాలను తాము విపరీతంగా సృష్టించామన్నారు.
మైక్రోసాఫ్టులో ప్రపంచవ్యాప్తంగా 1,13,000 ఉద్యోగాలు ఉండగా, వారిలో 64వేల మందికి పైగా అమెరికా వారేనని చెప్పారు. వారిలో ఎక్కువగా వాషింగ్టన్ వారు ఉన్నారన్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మైక్రోసాఫ్ట్ రోడ్ మ్యాప్ ఏమీ మారదన్నారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ దేశానికి ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తుందన్నారు.
కాగా, ట్రంప్ గెలవగానే టెక్ కంపెనీలు అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాయి. గత నెల ట్రంప్‌తో భేటీ అయిన 12 టెక్ దిగ్గజ సీఈవోలలో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఈ సమావేశంలో అమెరికాలో ఉద్యోగాలు ఎక్కువగా కల్పించాలని, పెట్టుబడులు పెంచాలని ట్రంప్ హితవు పలికారు. ట్రంప్ ప్రధాన ఎన్నికల సూత్రం అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications