కురచ దుస్తుల్లో అమ్మాయిల డ్యాన్స్: మైక్రోసాఫ్ట్ క్షమాపణ
శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు రావడంతో చివరకు ఆ సంస్థ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలకు చెందిన అమ్మాయిలతో పొట్టి దుస్తుల్లో డ్యాన్సులు చేయించడమే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళితే... గత గురువారం రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్‌లోని ఎక్స్‌బాక్స్ గేమ్స్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ తర్వాత జరిగిన పార్టీలో సంతోషాన్ని పంచుకునేందుకు అందమైన అమ్మాయిలతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో కురచ దుస్తులు వేసుకున్న అమ్మాయిలు చిందులేశారు. అయితే అమ్మాయిల్లో ఎక్కువ మంది పాఠశాల స్థాయి యువతులే ఉండటం గమానార్హం. కాగా, ఆ ఫొటోలు, వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో దర్శనమిచ్చేసరికి నెటిజన్లు మైక్రోసాఫ్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైక్రోసాఫ్ట్ వంటి గొప్ప పేరున్న సంస్థకు ఇటువంటి పనులు తగవని హితవు చెప్పారు. దీంతో మైక్రోసాఫ్ట్‌లోని ఎక్స్‌బాక్స్ హెడ్ ఫిల్ స్పెన్సర్ స్వయంగా క్షమాపణ చెప్తూ ఓ ప్రకటన చేశారు. పార్టీలో జరిగిన సంఘటన తప్పు అని, సహించరానిదని స్పష్టం చేశారు. దీనిపై సంస్థాగతంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications